YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత - టిడిపి నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

సుప్రీంకోర్టులో ప్రభుత్వ పిటీషన్ కొట్టివేత - టిడిపి నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

స్థానిక సంస్థ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిసన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపధ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  175 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, క్లస్టర్, మండల కమిటిల బాధ్యులు పాల్గోన్నారు.  ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ''45డివిజన్లలో తొలిదశ పంచాయితీ ఎన్నికల ప్రక్రియ నేటినుంచి ప్రారంభం..అన్ని గ్రామాల్లో నామినేషన్లు పడేలా చూడాలి. బలవంతపు ఏకగ్రీవాలు లేకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అభ్యర్ధులంతా సంబంధిత సర్టిఫికెట్లు సిద్దం చేసుకోవాలి. నేటివిటి సర్టిఫికెట్లు, కాస్ట్ సర్టిఫికెట్లు, నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి.  ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ. ఈసి ఆదేశాలను ధిక్కరించడం రాజ్యాంగ ఉల్లంఘనే.  చట్టాలను పాటించడం, రాజ్యాంగాన్ని గౌరవించడం మనందరి బాధ్యత అని అన్నారు.
వినాశకాలే విపరీత బుద్దిలా జగన్ రెడ్డి ధోరణి.


జగన్ రెడ్డి ఒక సైకో, ఉన్మాద మనస్తత్వం. అతని చర్యలతో రాష్ట్రం నాశనం అవుతోంది. ప్రజల్లో అశాంతి, అభద్రత నెలకొంది.  సిఎం ఇంటి ముట్టడి చేస్తే అత్యాచార యత్నం కేసు సిగ్గుచేటు. ఫీజుల కోసం ఆందోళన చేసే విద్యార్ధులపై రేప్ కేసులా..? రైతుల చేతులకు బేడీలు వేయడం ఎప్పుడైనా జరిగిందా..? ఎస్సీలపై, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడం ఎక్కడైనా ఉందా..?  వైసిపి దుర్మార్గాలపై రాజీలేని పోరాటం చేయాలి. వీరోచితంగా పోరాడేవాళ్లు అందరికీ అభినందనలు.  పంచాయితీ ఎన్నికలంటే వైసిపి పారిపోతోంది. నిష్పాక్షిక ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసిపి భయం. బాధిత బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి ప్రజలంతా ఏకమై బుద్ది చెబుతారనే భయంతోనే ఎన్నికలకు మోకాలడ్డుతోంది. బాధిత రైతులు, రైతుకూలీలంతా సంఘటితమై ఓడిస్తారనే భయంతోనే వెనుకంజ వేస్తోందని అన్నారు.


జగన్ రెడ్డి వేధింపులు, బెదిరింపులు, కక్ష సాధింపు చర్యలతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే అందరూ ఛీకొట్టే పరిస్థితి వస్తుంది. శాసనమండలి రద్దు, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు,  ఎన్నికల సంఘంపై దాడి, ఎన్నికల కమిషనర్ పై దుర్భాషలు, న్యాయస్థానాలపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, మీడియాపై అణిచివేత.. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు చేపట్టిన వాళ్లు చేసే చర్యలు కాదని అన్నారు.
రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాశనం చేస్తున్నాడు అనే ఆవేదన ప్రజల్లో ఉంది.  నామినేషన్లు స్వీకరించని చోట్ల, అధికారులపై ఫిర్యాదులు చేయాలి, ఆ ఫిర్యాదులను గోడలకు అతికించాలి. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వాలి. ఆయా ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలతో ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, జిల్లా పంచాయితీ అధికారికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలి. అధికారుల సహాయ నిరాకరణపై, గైర్హాజరుపై రాష్ట్ర గవర్నర్ కు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదులు పంపాలని అయన అన్నారు. ఈసి నోటిఫికేషన్ ప్రకారం మేము నామినేషన్లు ఇవ్వడానికి వెళ్లాము, అక్కడ ఎవరూ లేరనే'' ఫిర్యాదులను అందరికీ పంపించాలి.


రేపటి గణతంత్ర దినం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణలో అందరూ పాల్గొనాలి. జెండా ఆవిష్కరణల తర్వాత, వైసిపి ఉన్మాద పాలనను, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఖండించాలి. ప్రాథమిక హక్కులు కాలరాయడాన్ని, చట్టాలకు తూట్లు పొడవడం, రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడటంపై ధ్వజమెత్తాలని'' చంద్రబాబు పిలుపునిచ్చారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు డి జగదీష్, టిడి జనార్దన్, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, శ్రావణ్ కుమార్, చెంగల్రాయుడు, గన్ని వీరాంజనేయులు, అనంతకుమారి, చింతకాయల విజయ్, వెంకటపతిరాజు తదితరులు మాట్లాడారు.

Related Posts