YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రామతీర్థం శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలకు 28న బాలాలయంలో ప్రతిష్టాపన - దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

రామతీర్థం శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలకు 28న బాలాలయంలో ప్రతిష్టాపన - దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండ పై  గల  శ్రీ కోదండరాముని ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుమలలో తయారు చేయించిన శ్రీసీతారామలక్ష్మణుల విగ్రహాలు  రామతీర్థానికి ప్రత్యేక వాహనంలో చేరుకున్నాయి అని,   కొండ దిగువ ఉన్న ప్రధాన ఆలయంలోని బాలాలయంలో  28న ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు...
సొమవారం బ్రహ్మాణ వీధిలోని మంత్రి కార్యాయలంలో విజయనగరం ఎసీ సి.హెచ్ రంగరావు, అర్చకులు వెంకటసాయిరాం కలిసి 28న ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించారు.


తిరుమలలో నిషణతులైన శిల్పులతో కృష్ణ శీలరాతితో విగ్రహాలను తయారు  చేయడం జరిగిందన్నారు. విజయనగరం చేరిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలను రామతీర్థం ప్రధానాలయంలో ప్రత్యేకంగా ధాన్యంతో నింపి చక్కగా అలంకరించిన హోమపు శాలలో లో భద్రపరిచారు.  ఈ నెల 28న బాలాలయంలోనే సీతారామలక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించ నున్నట్లు తెలిపారు.  25 నుంచే స్వామికి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు.


తిరుపతి వేదిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అగ్నిహోత్రం శ్రీనివాస చార్యులు ఆధ్వర్యంలో వైఖాసన ఆగమ సంప్రదాయం ప్రకారం ఆదివాసం, హొమములు, విగ్రహాప్రతిష్ట కార్యక్రమలు కొండ దిగువన  ఉన్న రామాలయంలోని కల్యాణమండపంలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు ఉన్నారు.

Related Posts