ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది దాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల నియోజవర్గ ఎలక్ట్రో ల్ రిజిస్ట్రేషన్ అదికారి శ్రీమతి అనురాధ అన్నారు.
సోమవారం మునిసిపల్ ఆఫీస్ సమావేశభవన్ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం 2021అవగాహన కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ ఎలక్ట్రో ల్ రిజిస్ట్రేషన్ అదికారి . శ్రీమతి అనురాధ. నంద్యాల నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్ట్రో ల్ రిజిస్ట్రేషన్ అదికారి . రవికుమార్ . నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి. మండల
డెవలప్మెంట్ అధికారి భాస్కర్ .నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ. డిప్యూటీ తహసీల్దార్ రామనాథరెడ్డి . తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నంద్యాల నియోజకవర్గం ఎలక్ట్రో ల్ రిజిస్ట్రేషన్ అధికారి . శ్రీమతి అనురాధ మాట్లాడుతూ ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జాతీయ ఎన్నికల కమిషనర్ వారి ఆదేశానుసారం ఈరోజు పదకొండవ ఓటర్ల దినోత్సవం జరుపు కుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఓటర్లను చైతన్యపరచడం వారి ఓటును వారు వినియోగించుకునేలా చేయడం ఓటు హక్కు కలిగి ఉన్నవారిని ఓటరుగా నమోదు చేయించి ఓటు హక్కు ను వినియోగించుకోనేల చేయాలన్నారు.
మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ 1950వ సంవత్సరం జనవరి 25 తారీకు నుండి అమల్లోకి వచ్చిందని జాతీయ ఎన్నికల కమిషన్ వారి ఆదేశానుసారం 2011 వ సంవత్సరం నుండి ఓటర్ల దినోత్సవం జరుపుకుంటునమని ఆయన అన్నారు. ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.
నంద్యాల డి.ఎస్.పి చిదానంద రెడ్డి .నంద్యాల నియోజకవర్గం అసిస్టెంట్ ఎలక్ట్రో ల్ రిజిస్ట్రేషన్ అదికారి రవికుమార్ .యమ్ పీ డీ ఓ భాస్కర్ మాట్లాడుతూ మన భారతదేశం ప్రజాస్వామ్య దేశాలలో ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన దేశమని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్రాసిన భారత రాజ్యాంగ ప్రకారం మనము ఈ ప్రజాస్వామ్య దేశంలో మన నాయకులను ఓటు హక్కు ద్వారా నే ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటరు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించి మంచి నాయకున్ని ఎన్నుకోవాలి అని అన్నారు. గతంలో ఓటుహక్కు అర్హత పొందాలంటే 21 సంవత్సరం నిండవలసి ఉండేదని కానీ జాతీయ ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు ప్రస్తుతం 18 సంవత్సరములు నిండిన అందరూ ఓటుహక్కుకు అర్హులని 18 సంవత్సరాల నిండిన ఓటరుగా నమోదు కాని వారు ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు పవిత్రతను కాపాడి ఓటును సద్వినియోగం చేసుకొని పోలింగ్ శాతాలను పెంచాలన్నారు.
అనంతరం ఎన్నికల కమిషనర్ వారి వీడియో ప్రదర్శన ను హాజరైన అందరికీ ప్రదర్శించి చూపించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ రామ్ నాథ రెడ్డి . బి ఎల్ వో లు సచివాలయ సిబ్బంది. తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది. మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.