పారిశ్రామిక ప్రాంతం గాజువాక నియోజకవర్గ బిజెపి కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభా యాత్రను శ్రీమఠం పీటాదిపతులు శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ వారు గాజువాకలో యాత్ర ప్రారంబించారు. అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న శ్రీ రామ మందిర నిర్మాణానికి నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంలో భాగంగా తలపెట్టిన ఈ మహాత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పూర్ణనంద సరస్వతి స్వామీజీ పాల్గొని గాజువాక బస్ డిపో వద్ద ఉన్న విజయదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ ఉద్యమంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో శోబా యాత్ర ప్రారంభించారు . ఈ సంధర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కులాలకు, మతాలకు , రాజకీయ పార్టీలకు అతీతంగా మనమందరం అయోధ్యలో శ్రీ రాము మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విశ్వహిం దూ పరిషత్ , బీజేపి , ఆర్ ఎస్ ఎస్ , ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు పర్యవేక్షణలో గాజువాక డిపో దగ్గర ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి గుడి దగ్గరకు చేరుకొని, కొత్తగాజువాక, పాతగాజువాక, వంటిల్లు, శ్రీ కృషిణదేవరాయరాయల కూడలి (జగ్గు సెంటర్,), తాసిల్దార్ ఆపీసు, కూర్మన్నపాలెం , దువ్వాడ, మీదుగా వెళ్ళి టౌన్ షిప్ త్రిశక్తి ఆలయం వరకు కొనసాగిన ఈ యాత్రలో పార్టీ ముఖ్య నాయకులు ఇంద్రసేనారెడ్డి , గూటూరు.శంకరరావు,బాటా.శ్రీను ,సిరసపల్లి నూకరాజు , విశ్వహిందూపరిషత్ నుండి శ్రీనివాస్ ,నాగేశ్వరరావు,జీలకర్ర రమణ , జీలకర్ర భువనేశ్వరి , బోండా శ్రీదేవి , బోండా యల్లాజీ , విజయదుర్గా ఆలయం చైర్మన్ పిల్లా.శంకరరావు,త్రిశక్తి ఆలయకమిటీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి ,కృష్ణంరాజు ,సోంబాబు,వర్రి.లలిత,రమనమ్మ ,స్టీల్ ప్లాంట్ అదికారులు గోపాల్ తదితర పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు , అభిమానులు అధిక సంఖ్యలో మహిళలు , ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు