YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

కేంద్ర బలగాలు పంపండి

కేంద్ర బలగాలు పంపండి

ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచాయి. సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎస్ఈసీ కూడా దూకుడు పెంచింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంటామని ఉద్యోగ సంఘాలు చెబుతుండటంతో కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రూట్ మార్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ కార్యదర్శికి సంచలన లేఖ రాశారు. ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు చెప్పిందని.. అయితే కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయన్నారు. అందుకే కేంద్రం నుంచి సిబ్బందిని కేటాయించాలని లేఖలో కోరారు. ఈ లేఖపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. లేఖలో ప్రస్తావించిన అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పందించారు.

వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగులంతా.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. తాము ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని చెప్పలేదని.. ఆరోగ్యం సరిగాలేని ఉద్యోగులను మినహాయించి..మిగిలిన వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్నారు. ఉద్యోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. తాము ఎన్నికలపై తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. ప్రభుత్వం, ఎస్‌ఈసీ చెప్పేదానిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌కు తాము వ్యతిరేకం కాదని.. తీర్పు పూర్తి కాపీ చూశాక స్పందిస్తామన్నారు. 27న అన్ని సంఘాల నేతలతో అమరావతి జేఏసీ సమావేశం అవుతుందన్నారు.

ఈ సమావేశంలో ఎన్నికలపై తదుపరి కార్యాచరణను రూపొందిస్తామని ప్రకటించారు.

Related Posts