జీఎస్టీ విధానంతో రాష్ట్రాలకు భారీగా నష్టాలు ఎదుర్కొంటుండగా కేంద్రం పరిహారం కింద విడతల వారీగా అందిస్తోంది. తాజాగా మరో దఫా జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. జీఎస్టీ విధానంతో పలు రాష్ర్టాలు ఎదుర్కొంటున్న నష్టాల భర్తీకి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. గతేడాది డిసెంబర్‌లో విడుదల చేయగా ఇప్పుడు మరోసారి కేంద్ర ఆర్థిక శాఖ పరిహారం అందించింది.ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 3,174.15 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం మరో విడత పరిహారం విడుదల చేసింది. స్పెషల్ బారోయింగ్ ప్లాన్‌లో భాగంగా తెలంగాణ రాష్ర్టానికి రూ.1,336.44 కోట్లు విడుదల చేయగా.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,810.71 కోట్లు విడుదల చేసింది. జీఎస్టీ పరిహారం విషయమై రాష్ట్రాలు ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి, ఆర్థికమంత్రులను కలిసి విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం విడుదల వారీగా జీఎస్టీ పరిహారం విడుదల చేస్తోంది.