YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

ఘనతంత్రానికి ఏర్పాట్లు

ఘనతంత్రానికి ఏర్పాట్లు

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" రోజు. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 (1950)న గౌరవంగా గణతంత్ర దినోత్సవం

జరుపుకుంటారు. ఈ రోజున ఉత్సవాలు, పరేడ్లు, విద్యాలయాల్లో తీపి మిఠాయులు పంచడం, సాంస్కృతిక ప్రదర్శనలు చేస్తారు.వాస్తవానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర వచ్చినా, 1950వ దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది.

స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా 1950 జనవరి 26న భారత్ అవతరించింది. అదే రిపబ్లిక్ డే.. ఇది మనకు 72వ భారత గణతంత్ర దినోత్సవం. అయితే.. దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు మాత్రమే. కానీ..

రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానంలో రూపొందించారు.
అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది. రాజ్యాంగ రచనకు మొత్తం రూ.64 లక్షలు

ఖర్చయ్యింది.తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బార్ హాల్‌లో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. ఐదు మైళ్ల పొడవున సాగిన పరేడ్ తర్వాత,

ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ ఏడాది ప్రత్యేకతలు:
1. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పరేడ్‌కు పోటీగా అదేరోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీఎత్తున రైతుల పరేడ్‌ నిర్వహించడం గమనార్హం. దాదాపు 5000 మంది రైతులు ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొంటారని అంచనా. ప్రజలు పోరాడి

సాధించిన ఈ గణతంత్రంలో రైతులు, కార్మికులు లేకుంటే కండపుష్టి వచ్చేది కాదని, ఆ రోజు స్వాతంత్య్రం తెచ్చిందీ రైతులే.. ఈ 74 ఏళ్ల స్వతంత్ర భారతం యొక్క మనుగడను కాపాడుతున్నదీ రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.
2. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది విదేశీ ప్రత్యేక అతిథి హాజరు కావడం లేదు. విదేశీ అతిథి లేకుండానే భారత్ రిపబ్లిక్ వేడుకలు నిర్వహించడం ఇది నాలుగోసారి మాత్రమే. 1952, 1953 మరియు 1966లలో విదేశీ అతిథి హాజరు కాలేదు.
3. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు రిపబ్లిక్ డే నిర్వహణను కోవిడ్-19 నిబంధనల నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 1.5 మీటర్ల సోషల్ డిస్టాన్సింగ్‌తో మార్చ్ చేయనున్నారు.
4. 321 పాఠశాలల విద్యార్థులు మరియు 80 జానపద కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఈస్ట్ జోన్‌కు చెందిన కళాకారులు సైతం గణతంత్ర వేడుకలో పాలు పంచుకోనున్నారని ప్రకటించారు.
5. ఈ ఏడాది అట్టారి సరిహద్దులో రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించడం లేదు. జనవరి 26న భారత్, పాకిస్తాన్‌లు సంయుక్తంగా పరేడ్ నిర్వహించేవి. కరోనా నేపథ్యంలో మార్చి 2020 నుంచి సామాన్యులను అట్టారి బార్డర్‌లోకి అనుమతించడం లేదని

తెలిసిందే.

Related Posts