YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

దేశీయం

గోవాలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా

గోవాలో మున్సిపల్ ఎన్నికలు వాయిదా

మున్సిపల్‌ ఎన్నికలను ఏప్రిల్ వరకు వాయిదా వేస్తూ గోవా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న వేళ గోవా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో

అధికారులంతా ఆ పనుల్లోనే నిమగ్నం అవుతారని, వారికి భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోవా ఎస్‌ఈసీ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి, ఫిబ్రవరితో పాటు మార్చి వరకు కొనసాగుతుందని.. అందువల్ల ఏప్రిల్‌ తర్వాతే

ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 18నే గెజిట్ విడుదల చేసింది.గోవాలో పనాజి కార్పొరేషన్‌ సహా 11 మున్సిపల్‌ కౌన్సిళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పాటు వివిధ గ్రామపంచాయతీల్లో ఉప ఎన్నికలు, దక్షిణ

గోవాలోని నవేలిమ్‌ జిల్లా పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. గోవా ఎస్‌ఈసీ చోఖా రామ్‌గార్గ్‌ నిర్ణయంతో ఇవన్నీ ఏప్రిల్ వరకు వాయిదాపడ్డాయి.ఇటు ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో

చుక్కెదురైంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనమని ఉద్యోగ సంఘాలు ప్రకటించడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎన్నికలు

నిర్వహించుకోవచ్చు. ఎస్‌ఈసీ మానవతా దృక్పథంతో వ్యవహరించాలి' అని ఉద్యోగ సంఘాల ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
====================================

Related Posts