పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత తరుణంలో ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సర్కారు హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జిని ఆశ్రయించగా... అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. దీన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సవాల్ చేయగా.. హైకోర్టు సీజే జస్టిస్ ఏకే గోపాలస్వామి, జస్టిస్ ప్రవీణ్ కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. సుప్రీంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది.ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు తీర్పు వెలువడే వరకు ఎన్నికలు వాయిదా వేయాలని చీఫ్ సెక్రటరీ కోరారు. ఇదే తరుణంలో తాము ఎన్నికల విధుల్లో ఉన్నామని డీజీపీ, హోం శాఖ కార్యదర్శి అఫిడవిట్ ఎలా దాఖలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఓ పోలీసు అధికారి ప్రమోషన్ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఇంతకు ముందే డీజీపీ, హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఎన్నికల విధుల్లో ఉండటంతో హాజరు కాలేమని వారిద్దరూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం.. సుప్రీం తీర్పు వచ్చేవరకు ఎన్నికలు వాయిదా వేయాలని సీఎస్ కోరుతున్నప్పుడు.. ఎన్నికల విధులని ఎలా అంటారని ప్రశ్నించింది. బుధవారం తప్పకుండా తమ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.