సి ఎం జగన్ మోహన్ రెడ్డి పార్లమెంట్ సభ్యుల సమావేశం ముగిసింది. ఎం పి విజయసాయి రెడ్డి భేటీ వివరాలు మీడియాకు తెలియజేసారు. పార్లమెంట్ లో అనుసరించాల్సిన అంశం పై ముఖ్యమంత్రి దిశా నిర్ధేశం చేశారు. పోలవరం 1050కోట్ల బకాయిలు. సరిదిద్దిన అంచనా 56 వేల కోట్ల కు ఆమోదింపచేయాలి. 16 మెడికల్ కాలేజి ల కు 3 అనుమతి వచ్చాయి.. మరో 13 సాధిస్తాము. పిడీఏఎస్ బకాయిలు, నివర్ తుఫాన్ నిధులు, ఎం డి అర్ ఆఫ్ నిధులు 2 వేల కోట్లు రాబట్టాలి. పవర్ పర్చేజి అగ్రిమెంట్లు విషయం లో 2 ప్రాజెక్ట్ ల విషయం లో 800 కోట్లు ఆదా అయింది. 10 వేల మెగావాట్ల సోలార్ ఉత్పత్తి ప్రాజెక్ట్ లకు టెండర్లు., దిశ బిల్లు సవరణ చట్టం సాధించాల్సింవుందని అన్నారు.
హై కోర్టు ను కర్నూల్ కు తరలించే విషయం లో రీ నోటిఫికేషన్ చేయాల్సిన అంశం వుంది. మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పనిదినాల పెంపు, రెవిన్యూ లోటు రాబట్టాలి. 11 బిల్లులు ప్రవేశపెడితే అనుసరించాల్సిన విషయం. వ్యవసాయ చట్టాల పై దిశ దశ నిర్ధేశించారని అన్నారు.
కనీస మద్దతు ధర కల్పించాలి అదే నినాదం. కండిషన్ ల తో వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇచ్చాము.. కండిషన్ లు అమలు చేయాలి. దేవాలయాల విద్వoసాల్లో టిడిపి వారి ప్రమేయం ఉంది.. ఆధారాలు ఉన్నాయి..అవి అన్ని పార్లమెంట్ ముందుపెడతాం. రైల్వే జోన్ అలసత్వం పై మంత్రి తో చర్చిస్తాం. రాష్ట్రాల మధ్య నది జలాలు సమస్య పై చర్చ జరుపుతామని అన్నారు.
నదులన్నీ జాతీయం చేసి నిష్పత్తుల ప్రకారం పంపిణీ చేయాలి ఇది పార్టీ విధానం. మైనర్, మేజర్ పోర్ట్ ల తో పాటు పలు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. బిల్లు ల వారిగా స్పందిస్తాం. సుప్రీం కోర్టు తీర్పు పై స్పందిస్తూ ప్రభుత్వం, అధికారులు పరిశీలించి స్పందిస్తారు. ఇగో అనడానికి వీల్లేదు...ఎస్ ఇ సి నిర్మయం తీసుకుంది. ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుందని అయన అన్నారు.