YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్థానిక ఎన్నికల రేసులో టీడీపీ విజయం తథ్యం

స్థానిక ఎన్నికల రేసులో టీడీపీ విజయం తథ్యం

పత్తికొండ మండల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని టిడిపి రాష్ట్ర  కమిటీ కార్యదర్శి బత్తిని వెంకట్రాముడు తెలియజేశారు. స్థానిక ఎన్నికల బరిలో తెలుగుదేశం పోటీ చేస్తుందని  టిడిపి రాష్ట్ర కమిటీ కార్యదర్శి బత్తిని అన్నారు.సోమవారం మండల కేంద్రమైన   పత్తికొండలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  తెలుగుదేశం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఆదేశాల మేరకు టిడిపి రాష్ట్ర కమిటీ కార్యదర్శి బత్తిని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్నారు.పంచాయితీ పోటీలో తప్పకుండా చేయాలన్నారు పోటీలో విజయం సాధించి తెలుగుదేశం సత్తాచాటాలి అన్నారు . ఈ కార్యక్రమంలో టిడిపి ఉపాధ్యక్షులు సాంబశివ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రమోద్ కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు తిరుపాలు, టిఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్, బీసీ సెల్ జిల్లా నాయకులు రామ నాయుడు, మండల కన్వీనర్ బత్తిన లోకనాథ్, తదితర ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు .

Related Posts