YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అంతరాలు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందిద్దాం - గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

అంతరాలు లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందిద్దాం - గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం

అంతరాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శాసన సభ ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్సీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అంతరాలు లేకుండా అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్రమోడి విశేష కృషి చేస్తున్నారన్నారు. ర్యాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. వ్యక్తులకు కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రజల్లో స్థైర్యాన్ని నింపిందన్నారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం...ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఫొటోలు దిగారు. అంతకుముందు శాసనసభ భద్రతా సిబ్బంది అందజేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శులు, అసెంబ్లీ ఉద్యోగులు పాల్గొన్నారు.

Related Posts