YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మార్వొలే రిజిస్ట్రార్లు...!!

ఎమ్మార్వొలే రిజిస్ట్రార్లు...!!
రైతులకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు ఉండేలా ప్రభుత్వం జూన్ నుంచి తహసీల్దార్లకే బాధ్యతలు అప్పగించనున్నది. రైతుల చెంతనే భూ రిజిస్ట్రేషన్లు నిర్వహించడానికి సీఎం కేసీఆర్ నూతన రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టారు. భూ రిజిస్ట్రేషన్లు చేయడంతోపాటు పాస్‌బుక్‌లను కొరియర్‌లో ఇంటికి పంపేలా రాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటున్నది. త్వరలోనే ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించనుంది. తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల వీటన్నింటికీ చెక్ పడనున్నది. రిజిస్ట్రేషన్‌కు వచ్చే రైతుల భూ వివరాలను సవివరంగా తహసీల్దార్ చూడడంతోపాటు కబ్జాలో ఎవరున్నారు, పట్టాదారు ఎవరు, ఇంతకుముందు కాస్తులో ఎవరు ఉన్నారు, పట్టాభూమా ప్రభుత్వ భూమా, పహాణిలో ఎవరి పేరు ఉంది అనే తదితర వివరాలను పరిశీలించనున్నారు. క్రయవిక్రయాలు జరిగే క్రమంలో ఆ గ్రామంలోని ఇద్దరు రైతుల సమ్మతితోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేటట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భూమి క్రయవిక్రయాలు జరిగే సమయంలో సబ్ రిజిస్టర్ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయానికి వారు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వస్తారు. సెల్‌డీడీ పాస్‌పుస్తకాలు సమర్పిస్తే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. అమ్మినవారి పాస్‌పుస్తకం నుంచి రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని తీసేసి కొన్నవారి పాస్‌పుస్తకంలో నమోదు చేస్తారు. రెండో విడుత మే 12 నుంచి పైలట్ ప్రాజెక్టుగా రామాయంపేట మండలాన్ని తీసుకొని ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయనున్నది. జిల్లాలో 20 మండలాలు ఉండగా నాలుగు రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మండలాల్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. మిగతా 16 మండలాల్లో తహసీల్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లపై తహసీల్దార్లకు హైదరాబాద్‌లో ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. మండలాల్లోని రిజిస్టేషన్లు చేయడం వల్ల భూములు ఉన్న ప్రతి రైతుకు లాభం చేకూరనున్నది. మూడుదఫాలుగా తహసీల్లార్లకు శిక్షణ ఇచ్చారు. రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. రైతు సమ్మతి లేకుండానే అతడి భూమిని ఇంకో రైతుపైన చేయడంపైన వివాదాలకు దారితీస్తున్నది. ఒకే సర్వే నంబర్‌ను బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అదే రోజు పాస్ పుస్తకాన్ని తిరిగి సబ్‌రిజిస్టర్‌కు పంపుతారు. సబ్ రిజిస్టర్ ఎవరి పుస్తకాన్ని వారికి సెల్‌డీడీ భూమిని కొన్నవారిని కొరియర్ ద్వారా పంపిస్తారు. దీంతో భూమి కొన్నవారు, అమ్మినవారు భూరిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టు తిరిగే సమస్య ఉండదు. ఇప్పటికే జిల్లాలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించింది. దీంతో భూయజమానులపై ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రత్యేక అధికారి ఉండి ఏ రోజుకారోజు ధరణి వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని పొందుపరుస్తారు. దీంతో రైతులకు రిజిస్ట్రేషన్ల కార్యాలయాల చుట్టూ తిరుగకుండా పనిభారం తగ్గుతుంది.

Related Posts