YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం దేశీయం

రాజు గారి లెక్క తేలుస్తారా...

రాజు గారి లెక్క తేలుస్తారా...

పార్లమెంటు సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడంతో రెండు విడతలుగా జరుతున్న ఈ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే అవకాశాలున్నాయి. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల్లోనైనా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలుంటయా? లేదా? అన్న చర్చ పార్టీలో జరగుతుంది.వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత ఏడెనిమిది నెలల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగానే తప్పుపడుతున్నారు. తాను పార్టీలోనే ఉన్నానంటూనే పార్టీపైన, ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. రఘురామ కృష్ణంరాజు పార్టీ నిబంధనలను అతిక్రమించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే వైసీపీ స్పీకర్ ఓంబిర్లాను కోరింది. లేఖను కూడా సమర్పించింది.అయితే స్పీకర్ ఇప్పటి వరకూ రఘురామ కృష్ణంరాజుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనర్హత వేటు వేయాలంటే తొలుత రఘురామ కృష్ణంరాజు వివరణ కూడా స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఈసారి వైసీపీ ఎంపీలు గట్టిగా వత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు జగన్ నిర్వహించిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలోనూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. మరోసారి స్పీకర్ కు రఘురామ కృష్ణంరాజు పై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారురఘురామ కృష్ణంరాజు నిత్యం రచ్చబండ పేరుతో విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలన్నింటినీ వీడియోల రూపంలో స్పీకర్ కు మరోసారి సమర్పించాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు. రఘురామ కృష్ణంరాజును ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించకూడదని ఎంపీలు సయితం జగన్ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. మొత్తం మీద పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో మరోసారి రఘురామ కృష్ణంరాజు అంశం హాట్ టాపిక్ గా మారింది.

Related Posts