YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఇద్దరు డిప్యూటీ మేయర్లు

ఇద్దరు డిప్యూటీ మేయర్లు

ఏంటండీ ఇది. అట్టా ఎట్టా చేయాలి ప్ర‌మాణ స్వీకారం. ఓ పూట ఆగితే ఏం కొంప‌లు అంట‌క పోతున్న‌య్. పోనీ.. ఒక రోజు ముందు పెట్టుకుంటే ఇంకేంటి న‌ష్టం. ఇన్నాళ్లూ బానే ఆగారు క‌దా. తొంద‌రేం లేదు క‌దా. ఆగీ ఆగీ స‌క్క‌ద‌నాల ముహూర్తం పెట్టారులే. పొయ్యి ఆ రోజు ఆ ముహూర్తాన ప్ర‌మాణ స్వీకారం చేస్తే.. హైద‌రాబాద్ కి కొత్త ద‌రిద్రం అంటుకున్న‌ట్లు అవుతుంది. అవ్వ‌క అవ్వ‌క ఎన్నో ఏళ్లుగా రాజ‌కీయాల్లో తిరుగుతూ.. ఒక కార్పొరేట‌ర్ ప‌ద‌వి ద‌క్కించుకుంటే.. ఆ ప‌ద‌వికి కూడా అలాంటి రాంగ్ టైంలో ప్ర‌మాణ స్వీకారం చేయాలి అన‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ చెప్పండి. సీఎం కేసీఆర్ అయితే అలా చేస్తారా.. సీఎం కాబోయే కేటీఆర్ అయితే అలా చేస్తారా.. మేమే దొరికామా.. మీకు ఆ ప‌ద‌వులు పెద్ద‌వి అయితే.. మాకు ఈ కార్పొరేట‌ర్ ప‌ద‌వి కూడా పెద్ద‌దే. ప్లీజ్ ద‌య‌చేసి ఆలోచించండి.. మా ప్ర‌మాణ స్వీకారాల టైం మార్చండి అంటున్నారు.
కానీ.. నోటిఫికేష‌న్ మాత్రం రిలీజ్ అయింది క‌దా. వాళ్లు బాగానే పెట్టేశారు ముహూర్తం. ప‌ద‌కొండో తారీఖున ప‌ద‌కొండు గంట‌ల‌కి అన్నారు. మంచి టైమింగు.. రైమింగు చూసుకున్నారు. కానీ.. ఆ రోజు అమావాస్య అని మాత్రం చెక్ చేయ‌లేదు. అక్క‌డొచ్చింది చిక్కు. ఆ టైం డిసైడ్ చేసిన వాళ్ల‌కి ఇలాంటి సెంటిమెంట్లు లేవు కావ‌చ్చు. కానీ.. కార్పొరేటర్ల‌కి ఉంటుంది క‌దా సెంటిమెంట్. ఇందులో ఎవ‌రినీ త‌ప్పుబ‌ట్టేది లేదు. వీళ్ల సెంటిమెంట్ లు వీళ్ల‌కున్న‌య్. వాళ్ల లెక్క‌లు వాళ్ల‌కి ఉన్న‌య్. మ‌రి కార్పొరేట‌ర్ గా ప్ర‌మాణం చేయ‌డం అంటే.. వాళ్ల‌కి అది పెద్ద విష‌య‌మే క‌దా. అయినా హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం.. అమావాస్య రోజు ఎలాంటి శుభ ముహూర్తాలూ స్టార్ట్ చేయ‌రు. అలాంటిది కార్ప‌రేట‌ర్ ప‌ద‌వికి ప్రమాణం ఎలా చేస్తారు చెప్పండి.అయితే.. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ల ఎంపిక డేట్ మారుతుంది అనే టాక్ అయితే బ‌య‌టికి వ‌చ్చింది. మ‌రి వాళ్ల డేట్ మారింది అంటే.. ముహూర్త‌మే క‌దా అనే టాక్ కూడా వ‌చ్చింది. అంటే.. కార్పొరేట‌ర్ల‌కి ఒక న్యాయం.. మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ల‌కు ఒక న్యాయ‌మా అంటున్నారు. ఇద్ద‌రినీ ప‌న్నెండో తారీఖుకి షిఫ్ట్ చేస్తే ఏ గోలా ఉండ‌దు క‌దా. నోటిఫికేష‌న్ లో కూడా ఒక వేళ ప‌ద‌కొండున వీలుకాకుంటే.. 12న పూర్తి చేయాలి అని మెన్ష‌న్ చేశారు. అంటే.. ముందే ఊహించి ఇలా నోటిఫికేష‌న్ ఇచ్చారేమో అనే వాళ్లూ ఉన్నారు. మ‌రి కార్పొరేట‌ర్ల ప్ర‌మాణ స్వీకారం డేట్ మారుతుందా లేదా అన్న‌ది చూడాలి.

Related Posts