YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

వన్ సైడ్ అభిప్రాయంతో ఇబ్బందులు

వన్ సైడ్ అభిప్రాయంతో ఇబ్బందులు

అన్ని పార్టీల రూటు ఒకటి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రూటు మరొకటి.. పార్టీ రాష్ట్రంలో పాతాళంలోకి పడిపోయే అవకాశాలు ఉన్నా కూడా విభేదాలకు ఏ మాత్రం కొదవ లేదు. ఇన్ని రోజులూ ఏవేవో కారణాలు వెతికారు.. పార్టీ రాను రానూ భ్రష్టుపట్టి పోతోంది తెలంగాణలో అంటే అందుకు ఇంఛార్జే కారణమని అంటున్నారు. సాధారణంగా తెలంగాణ కాంగ్రెస్‌లో లోకల్ నాయకుల పొసిగేది కాదు. జిల్లాల నాయకులు, రాష్ట్ర నేతల మధ్య ఎప్పటికప్పుడు భిన్నాభిప్రాయాలు నడిచేవి. కానీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కి.. రాష్ట్రంలోని ముఖ్య నాయకుల మధ్య చాలా భిన్నాభిప్రాయాలు వచ్చాయని అంటూ ఉన్నారు. పీసీసీకి కొత్త చీఫ్‌ ఎంపిక తెచ్చిన తంటాతో ఠాగూర్‌కు, నాయకుల మధ్య బేధాలు మొదలయ్యాయి. ఈ విషయంలో మొదటి నుంచీ పార్టీ నాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ రావడమే కాకుండా పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్న కొందరు కోపాన్ని కూడా పెంచేసుకున్నారు. ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం మాణిక్యం ఠాగూర్‌ హైదరాబాద్‌ కు రాగా.. పార్టీ ముఖ్య నాయకులతోపాటు.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలోని నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులతోనూ మాట్లాడారు ఠాగూర్‌. ఈ సమావేశాలకు నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. గాంధీభవన్‌ నుంచి ఓ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మాట్లాడగా.. ఠాగూర్‌ పెట్టే మీటింగ్స్‌ను నేను రాను అని ఆయన చెప్పేశారనే టాక్ నడుస్తూ ఉంది. అతను ఉన్నన్ని రోజులు రాను అని కోమటిరెడ్డి చెప్పినట్టు గుప్పుమంది వార్త.  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే రెండు పర్యాయలుగా పీసీసీ చీఫ్ రేసులో వచ్చారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తానని.. కాంగ్రెస్‌లో అధికారంలోకి తీసుకొస్తానని చెబుతూ.. అనుమతి ఇవ్వాలని మేడమ్‌కు లేఖ రాశారు కోమటిరెడ్డి. ఢిల్లీ వెళ్లినప్పుడు రాహుల్‌, సోనియాగాంధీలను కలిసి ఇదే విషయాన్ని చెప్పారు. ఇటీవల పీసీసీ చీఫ్‌ ఎంపిక కోసం  ఇంఛార్జ్‌ ఠాగూర్‌ చేపట్టిన అభిప్రాయ సేకరణ వన్‌సైడ్‌ జరిగిందన్నది కోమటిరెడ్డి ఆరోపణలు చేశారు. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న వారి పేర్ల జాబితాను సోనియాగాంధీకి పంపినప్పుడు దాంట్లో తన పేరు ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించలేదన్న ఆగ్రహంతో ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇంఛార్జి వ్యవహార శైలితో దూరంగా ఉండడమే మంచిదని అనుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకి ఇంఛార్జ్ పెద్ద అడ్డంకి అని తెలుస్తూ ఉంది.  

Related Posts