YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

రివర్స్ గేర్ లో కేటీఆర్

రివర్స్ గేర్ లో కేటీఆర్

పాలిటిక్స్ అంటే అంతే. ఎండొచ్చినా గొడుగు ప‌ట్టాలి. వానొచ్చినా గొడుగు ప‌ట్టాలి. త‌ప్ప‌దు. ఇప్పుడు మినిస్ట‌ర్ కేటీఆర్ కూడా అదే అంటున్నారు. అక్క‌డో ఇక్క‌డో ఏదో ఒక ఓపెనింగ్ కో మీటింగ్ కో వెళ్తుంటారు క‌దా హైద‌రాబాద్ లో. అలాగే ఇప్పుడు వెళ్లి.. సెంట్ర‌ల్ స‌ర్కార్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు. వాటిలో ముఖ్య‌మైన‌దే.. కేంద్ర పథ‌కాలు తెలంగాణ కి రావ‌డం లేదు. సౌత్ కి అంద‌డం లేదు అనేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.
కేంద్ర ప‌థ‌కాలు వ‌స్తున్న‌య్. కానీ మీరు అమ‌లు చేస్తున్నారా అనేది బిగ్ క్వ‌శ్చ‌న్. ఇదే ప్ర‌శ్న బీజేపీ వాళ్లు వేస్తే.. ఏం చేస్తారు అనేది ఇంకో క్వ‌శ్చ‌న్. మొన్న‌టి దాకా.. రైతు చ‌ట్టాల‌కి రైట్ కొట్ట‌లేదు. ఈ మ‌ధ్య వ్య‌తిరేకించి వెంట‌నే స‌పోర్ట్ చేశారు. ఆయుష్మాన్ భార‌త్ ఎవ్వరం కూడా అంతే. కేంద్రం ఆ ప‌థ‌కం అమ‌లు చేయ‌బ‌ట్టి రెండేళ్లు అవుతున్నా ప‌ట్టించుకోనే ప‌ట్టించుకోలేదు. మొన్న‌నే ఇక పెండింగ్ లో ఎందుకులే అని స్టార్ట్ చేశారు.కేంద్రం నిధుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇక ఈ డ‌బ్ల్యుఎస్ స్కీమ్ కూడా అంతే కదా. దాన్నీ యాక్సెప్ట్ చేయ‌లేదు. మా ప‌థ‌కాలే సూప‌రు.. మా ప‌థ‌కాలే పేప‌రు అంటుందాయే టీఆర్ఎస్.. మొత్తానికైతే.. రెండేళ్లు నుంచి ప‌డ‌క‌న ప‌డ్డ కేంద్ర ప‌థ‌కాల‌కి ఈ మ‌ధ్య‌నే లైన్ క్లియ‌ర్ చేస్తుంది తెలంగాణ స‌ర్కార్. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే.ఈ టైంలో.. కేంద్ర ప‌థ‌కాలు మ‌న దాకా రావ‌డం లేదు అనే కామెంట్ క‌రెక్టేనా అనే మాట ఆయ‌న‌కే తెలియాలి. వాళ్లు నిధులు ఇస్తున్నా ప‌ట్టించుకోనిది స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ క‌దా. మ‌రి ప‌ట్టించుకోన‌ప్పుడు ప్ర‌శ్న‌లెందుకు. ఓకే బుల్లెట్ ట్రైన్లు గ‌ట్రా రావ‌డం లేదు అనేది పాయింట్ ని బ‌లంగానే నిలదీసి నిన‌దించ వచ్చు. వ‌స్తే ఎక్కుతారా ఎక్క‌రా అనేది ప‌క్క‌కి పెడితే.. ఓ ప్ర‌పోజ‌ల్ అయినా లేక‌పోతే.. పొలిటిక‌ల్ గా కామెంట్లు కామ‌నేలే.కానీ.. ప‌థ‌కాల‌పై మాట్లాడ్డం మాత్రం విడ్డూరంగానే ఉంది. అంతేనా.. కేంద్రం పై తిరుగుబాటు జెండా ఎగ‌రేస్తున్నార‌ని.. మ‌ళ్లీ పొలిటిక‌ల్ గా త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నాన్ని కేటీఆర్ ఇప్ప‌టి నుంచే మొద‌లు పెట్టార‌ని.. కేంద్రం పై జెండా ఎగ‌రేయ‌డానికి తెలంగాణ స‌ర్కార్ రెడీ అవుతున్న‌ట్లు ఉంది ఎవ్వారం చూస్తుంటే. మ‌రి సీఎం కాబోతున్న జోష్ లో ఉన్నారా.. నేను సీఎంని అయితే.. బీజేపీకి బ్యాండుమేళం ఉందే అనే విష‌యాన్ని ఇండైరెక్ట్ గా లోక‌ల్ బీజేపీకి ఏమైనా హింట్స్ ఇస్తున్నారా అనేది కూడా ఇంట్ర‌స్టింగ్ పాయింటే.

Related Posts