YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణలో షర్మిల ప్రకంపనలు

తెలంగాణలో షర్మిల ప్రకంపనలు

తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది? రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయి ఈ ప్రశ్నల పై ఇప్పుడు తెలంగాణలో అన్ని పార్టీల్లో ఆసక్తి నెలకొంది. వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు బాహాటంగా, అంతర్గతంగా షర్మిల పెట్టబోయే కొత్త పార్టీని స్వాగతిస్తున్నారు. అయితేషర్మిల పార్టీ వైపు తమ నాయకులు వెళ్లకుండా టీఆర్ఎస్ జాగ్రత్త పడుతోందా అన్న దానిపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.ఇటీవల ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు...పార్టీలో మా వాళ్ళకి అన్యాయం జరుగుతోందటు తన శైలీకి భిన్నంగా ఫైర్ అయ్యారు. అదే సమయంలో మరో ఆసక్తికర వ్యాఖ్య చేశాడు పొంగులేటి. "సమయం వచ్చినపుడు ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళ్తాయి "అనేది ఆ వ్యాఖ్య. ఆయన వైసీపీ గూటికి చెందినవారు....గతం లో వైసీపీ నుంచి ఎంపీ గా గెలిచారు..వైసీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షులు గా పని చేసారు. కాబట్టి ఆయన వైసీపీ గూటికి వెళ్తారా అనే ఊహగణాలు జోరందుకున్నాయి.ఒక వైపు బీజేపీ మరో వైపు షర్మిలా కొత్త పార్టీ ఊహాగానాల మధ్య పొంగులేటి ఎలాంటి ఆలోచన చేయకుండా బుజ్జగించే పనిలో ఉంది టీఆర్ఎస్ అధిష్టానం. కేటీఆర్ సీఎం అయ్యాక కేబినెట్ లో మంత్రి పదవి హామీ కూడా పొంగులేటి కి దొరికినట్లు చెబుతున్నారు. మరి పొంగులేటి సర్దుకుపోతారా..షర్మిలకి జై కొడతారా అనే చర్చ ఖమ్మంజిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 2014లో తెలంగాణ గాలిలో సైతం ఖమ్మంలో ఒక ఎంపీ,ముగ్గురు ఎమ్మెల్యేలను వైఎస్ లెగస్సితోనే వైసీపీ చేజిక్కిచుకుంది.ఖమ్మం జిల్లాతో పాటు మెదక్..గ్రేటర్ హైదరాబాద్ నల్గొండ మహబూబనగర్ జిల్లాలకి చెందిన అధికార. ప్రతిపక్ష పార్టీల నేతలు షర్మిల తో టచ్ లోకి వెళ్ళారానే ప్రచారం కూడా జరుగుతోంది. వైఎస్ మరణం తర్వాత జగన్ కి టచ్ లో ఉండి వైసీపీలో కీలకపాత్ర పోషించిన పలువురు నేతలు  టీఆర్ఎస్ పార్టీ కీలక పదవుల్లో ఉన్నారు. వారందరు అప్పుడు ఇప్పుడు వైఎస్ కుటుంభానికి విధేయులుగానే ఉన్నారు. ఇప్పుడు అలాంటి నేతలు ఎన్నికలకు ముంది షర్మిలతో కలిసి నడుస్తారా అన్న ఆలోచనలో ఉన్న టీఆర్ఎస్ అధిష్టానం ఆ దిశగా కాస్త అలర్ట్ అయినట్టు తెలుస్తుంది.మొత్తానికి షర్మిల ప్రకంపణలు తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడిని పెంచుతున్నాయి

Related Posts