YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో కిల్లి కృపారాణి

హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో కిల్లి కృపారాణి

 ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ మరియు హ్యాండ్ క్రాఫ్ట్ ద్వారా నాణ్యమైన ధరకు చేతి వృత్తులుతో తయారు చేసే వస్తువులు ప్రజలకు అందుబాటులో ఉంచు తున్నారని మాజీ కేంద్రమంత్రి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళంలో రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో జండా ఆవిష్కరణ కృపారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి ఎగ్జిబిషన్ ద్వారా ప్రజలకు అనువైన ధరలో వస్తువులు కొనుగోలు చేసుకునే వీలుంటుందని సరసమైన ధరలకే వస్తువులు దొరుకుతున్నాయని, అన్నారు. అన్ని రకాల వస్తువులు ఒకే వేదిక వద్ద ఉండడం ప్రజల కొనుగోలు సులువుగా మారుతుందని ఇటువంటి ఎగ్జిబిషన్ను ప్రజలు సహకరించాలని తెలిపారు. విశాఖ అర్టిసన్స్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు మహమ్మద్ నసీం, మహమ్మద్ సలీం, మాట్లాడుతూ ప్రజలకు చేరువ లో నాణ్యమైన ధరల కు చేతివృత్తుల వారు తయారు చేసే వస్తువులు అందుబాటులో ఉంచుతున్నామని, దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, తెలిపారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని దీన్ని ప్రజలు గమనించాలని, వారు కోరారు.

Related Posts