YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కొత్త జిల్లాల్లో అధికారుల కొరత ఇంచార్జీలతోనే పాలన...!!

కొత్త జిల్లాల్లో  అధికారుల కొరత ఇంచార్జీలతోనే పాలన...!!

కొత్త జిల్లాల్లో కొత్త కష్టాలు నెలకొన్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆయా శాఖల్లో పూర్తి స్థాయిలో అధికారులు,సిబ్బది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.అధికారులను పూర్తి స్థాయిలో భర్తీ చేయని కారణంగా ఇంచార్జీలతో కాలం వెల్లదీస్తున్నారు. ఇక్కడ ఉన్న అధికా రులకు పదోన్నతులపై వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తున్నా రు.  2016 అక్టోబర్ 11న కొత్త జిల్లా ఏర్పడినప్పటికీ కీలకమైన కలెక్టర్‌తో పాటు ఇతర శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉండ డం, పాలన విభాగంపై ప్రభావం చూపుతంది. మంచి ర్యాల జిల్లా పరిధిలో 18 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు ఉ ండగా పోలీసుశాఖ మినహా, మిగిత శాఖ లకు 574 పోస్టులు మంజూరయ్యాయి. వీరిలో 383 మంది విధుల్లో చేరగా సుమారు 204 పోస్టులు ఖాళీగా ఉ ండడం గమనార్హం. ముఖ్యంగా కలెక్టరేట్ విభాగంలో 54 పోస్టుల్లో కేవలం 24 మంది మాత్రమే విధులు నిర్వహి స్తున్నారు. పశుసంవర్థక శాఖలో 10 పోస్టులు ఖాళీ ఉండ గా, మైనార్టీ శాఖలో మూడు పోస్టులు మంజూరు కాగా ఇంక రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో 13 మం ది విధులు నిర్వహిస్తుండగా ఇంక 7 పోస్టులు ఖాళీగా ఉ న్నాయి. పౌర సరఫరాల విభాగంలో 5 పోస్టులు ఉండగా , కీలకశాఖలో కూడా 204 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పాలన సౌలభ్యం కోసం జిల్లాల ఏర్పాటును ప్రభుత్వం చేపట్టింది. అంతే కాకుండా డిప్యూటేషన్‌లపై ఉద్యోగులను తరలి స్తున్నారు. దీని కారణంగా అభివృద్ది కుంటుపడుతుంది. ఇటివల కాలంలో తహసీల్దార్లకు ఆర్డీవోగా పదోన్నతులు ఇచ్చి వారి స్థానంలో ఇంచార్జీలను నియమించారు. ఆయా జిల్లాలో కీలక శాఖలైన ఉపాదిహామీ, వ్యవసాయ శాఖ అధికారులను బదీలి చేశారు. వారి స్థానంలో పక్క మండ లాల అధికారులకు అదనపు బాద్యతలు ఇచ్చారు. దీంతో వారు ఏ మండలానికి న్యాయం చేయలేకపోతున్నారు.పని ఒత్తిడి కారణంగా అభివృద్ది కుంటుపడుతుందని పలువురు అంటున్నారు. సామాన్య ప్రజలు బర్త్, కుల, ఆదాయ దృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుం టున్నారు. కానీ వారికి అధికారులు లేక సకాలంలో దృవీకరణ పత్రాలు అందడం లేదు. ఇంచార్జీగా అధికారి సకాలంలో ఏ మండలంలో అందుబాటులో లేక పోతు న్నారు. కొత్త జిల్లాల్లో పూర్తి స్థాయిలో అధికార సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం తలమునకలు అవుతుంది. పూర్తి స్థాయిలో అధికారులు లేకపోవడంతో ఉన్నవారితో నే పనులు చేయించడం పై అధికారులకు ఇబ్బందులను కలిగిస్తుంది.అధనపు భారంతో పనులు సకాలంలో చేయ లేక ప్రజల నుండి విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఉన్నతాధికారులు సైతం వాపోతున్నారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా ప్రకటించింది. ప్రజల వద్దకు పాలన మరింత దగ్గర చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అ ఇదిలా ఉంటే వీరికి పథకాల అమలు, హరిత హా రం మొక్కల పర్యవేక్షణ, నర్సరీల పరిశీలన లాంటి పను లను అప్పగిస్తున్నారు. అదికారులు ఎటు పోవాలో ఎం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు. ప్రజలకు పాల దగ్గర అనే అంశం ఎమో గానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఏ పనికైన కార్యాల యా నికి వెళ్లితే అక్కడా వారికి సార్ లేరు. బదిలీపై వెళ్లారు …వారి స్థానంలో పక్క మండలం అధికారి ఇంచార్జీగా ఉన్నారు. సార్ వచ్చే వరకు వేచి ఉండడండని సమాదానం వస్తుంది. జిల్లా విభజన కారణంగా ప్రజలకు మరింత ఇబ్బందులు ఎదురవు తున్నాయని పలువురు ఆరోపిస్తున్నా రు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, ఇం చార్జీల స్థానంలో రెగ్యూలర్ అధికారులను నియమిం చాలని ప్రజలు కోరుతున్నారు. పాలన సౌలభ్యం కోసం వ్యవస్థను మెరుగు పర్చేందుకు ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం కేసీఆర్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారు. కానీ దీంతో ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోగా నిర్వహణ బారం పెరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలోని చాలా కార్యాలయాల్లో అధికారులు లేక ఉన్నవారినే ఇంచార్జీలు గా చేసి అదనపు బాద్యతలు కట్టబేట్టారు. నూతనంగా ఉద్యోగులు నియమకం జరగ కపోవడంతో చాలా కార్యా ల యాల్లో ఈ సమస్య ఎదురవు తుంది. ప్రజలు తమ సమ స్యలు పరిష్కారం కాకపోగా సమయం వృధాతో పాటు ప్రయాణ ఖర్చులు అధికం అవుతున్నయంటున్నారు.అధికారులపై పని భారం పెరిగి తీవ్ర ఒత్తిడి లోనై ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నారు. కాగా అధికారులు స్థాని కంగా ఉండాలని అనే ప్రభుత్వ నిబంధనాలను మండల స్థాయి అధికారులు పట్టిం చుకు న్న దాఖలలు లేవు అని చెప్పావచ్చు. గతంలో ప్రజలు తమ సమస్యలను సంబంధిత శాఖల అధికారులకు తెలియజేశే వారు. అక్కడ పరిష్కా రం లభించకపోతే చివరగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే వారు. అప్పట్లో సోమవారం మాత్ర మే కలెక్టర్ ఫిర్యాదుల విభాగం ఉండేది కానీ ఇప్పుడు జిల్లాలు దగ్గరగా ఉండ డంతో ప్రతి రోజు కలెక్టరేట్లో ఫిర్యాదులు సమర్పించుకునే వారు కనిపిస్తున్నారు.  ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు గ్రామాని కి కలెక్టర్ వస్తే ప్రజలు గౌవరంగా చూసే వారు కానీ ఇప్పుడు జిల్లా లు దగ్గర కావడంతో గ్రా మ స్థాయిలో పరిష్కారం జరిగే సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారని ఉన్నతమైన స్థానానికి ప్రజలు ఎ లాంటి గౌరవం ఇస్తున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. కొత్త జిల్లాతో దూరాభారం తగ్గించి, సుపరిపాలన అందించే లక్షంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తజిల్లాలను ఏర్పాటు చేసింది..కొత్త జిల్లా ఏర్పాటుతో గతంలో పాత జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్‌కు వెళ్ళాలంటే దాదాపుగా 150 నుండి 200 కిలోమీటర్లు వెళ్ళాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ బాధ తప్పిందని ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts