స్వాతంత్ర్యం లభించిన 74 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు.72వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బీసి భవన్ ఆవరణలో జాతీయ జండాను అవిష్కరించారు. ఈ సందర్బంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన డాటా ప్రకారం జాతీయ స్థాయిలో బీసీ ఉద్యోగుల శాతం 9 శాతం, రాజకీయరంగంలో పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలలో 14 శాతం, హైకోర్టు-సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలలో 1 శాతం కాంట్రాక్టు – వ్యాపార పారిశ్రామిక రంగాలలో ఒక శాతం కూడా ప్రాతినిధ్యం లేదు. దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు 74 సంవత్సరాల తర్వాత కూడా ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటె ఇదేలా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. అందుకే అసెంబ్లీ-పార్లమెంటులో ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ప్రైవేటు రంగంలో మరియు హైకోర్టు-సుప్రీంకోర్టు జడ్జిల నియామకాలలో కూడా ఎస్సీ/ఎస్టీ/బీసీలకు జనాభా ప్రకారం కోటా కల్పించాలని కోరారు.ఇడబ్లుఎస్ రిజర్వేషన్ల జీ.వో తో పాటు బి.సి రిజర్వు రిజర్వేషన్లకు 25 శాతం నుంచి 52 శాతానికి పెంచాలని జాతీయ బి.సి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్ కృష్ణయ్య కోరారు.రాజ్యాంగ బద్ధమైన బిసి/ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు.