YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఘనంగా గణతంత్ర వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

ఘనంగా గణతంత్ర వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

భారత గణతంత్ర దినోత్సవ వేడుకల స్థానిక  ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ పెరేడ్ పరిశీలించేందుకు పుష్పాలంకృతమైన ప్రత్యేక వాహనంలో పోలీసు పెరేడ్ను రాష్ట్ర గవర్నర్ పరిశీలించారు. ఏపి స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శంకరబ్రత బాగ్చి ఆధ్వర్యంలో మంగళగిరి ఏపి యస్.పి. బెటాలియన్ డిఐసి జి.విజయకుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన పోలీస్ పరేడ్కు రంపచోడవరం ఏయస్పి బిందుమాదవ్ గరికిపాటి నేతృత్వం వహించగా, పరేడకు రెండవ కమాండెంట్గా ఏపి ఎపి 6వ బెటాలియాన్ అసిస్టెంట్ కమాండెంట్ పివి హనుమంతు పరేడ్ను నిర్వహించారు. పరేడ్ అటెండెంట్ గా ఏపియస్పి విజయనగరం 5వ బెటాలియాన్ ఆర్మ్ యస్వీ రమణ వ్యవహరించారు. తొలుత పోలీసు కవాతుల ప్రదర్శనలో భాగంగా ఇండియన్ ఆర్మీ కంటెంజెంట్ కమాండెంట్ సుబేదార్ ముఖేష్కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పోలీసు కవాతు ప్రదర్శించారు. అనంతరం ఏపి స్పెషల్ పోలీస్ సెకండ్ బెటాలియన్ కర్నూలుకు కంటెంజెంట్ కమాండర్గా జి.శ్రీనివాసరావు (ఆర్ఐ) అదే క్రమంలో థర్డ్ బెటాలియన్గా స్పెషల్ బెటాలియన్ కాకినాడకు కంటెంజెంట్ కమాండెంట్ గా బి.పెంటారావు (ఆర్ఐ), 9వ బెటాలియన్ వెంకటగిరికు కంటెంజెంట్ కమాండర్గా జె. చెన్న కేశవరావు ,  14వ బెటాలియన్ అనంతపురం కంటెంజెంట్ కమాండర్గా వై.వెంకటేశ్వర్లు (ఆర్ఐ) 16వ బెటాలియన్ స్పెషల్ పోలీస్ విశాఖపట్నం కంటెంజెంట్గా సి.రామకృష్ణ (ఆర్ఐ)లు నేతృత్వం వహిస్తారు. ఈ ప్రదర్శనలో భాగంగా పైప్లైన్ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఏపియస్పి బ్రాస్ బ్యాండ్ కంటెంజెంట్ కమాండెంట్ టి.కృష్ణయ్య ఆధ్వర్యంలో 2వ బెటాలియన్ ఏపియస్పి కర్నూలు, 3వ బెటాలియన్ ఏపియస్పి కాకినాడ, 5వబెటాలియన్ ఏపియస్పి విజయనగరం, 6వ బెటాలియన్ ఏపియస్పి మంగళగిరి, 9వ బెటాలియన్ ఏపియస్పి వెంకటగిరి, 11వ బెటాలియన్ ఏపియపి బాకరపేట, 14వ బెటాలియన్ ఏపియస్పి అనంతరపురం స్పెషల్ పోలీస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బ్యాండ్ బృందం ప్రదర్శన నిర్వహించారు. వీటితోపాటు మంగళగిరి స్పెషల్ పోలీస్ పైప్ బ్యాండ్ టి.పాండురంగారావు, స్కాట్లాండ్ పైప్లైన్ బ్యాండ్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు కు కమాండెంట్ గా ఎం. బాపూజీ ఆధ్వర్యంలో  గణతంత్య్ర  దినోత్సవం కవాతు ప్రదర్శనలలో పాల్గొన్నారు.
 

Related Posts