YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

ఇద్దరు అధికారులకు నిమ్మగడ్డ టైప్ షాక్

ఇద్దరు అధికారులకు నిమ్మగడ్డ టైప్ షాక్

ఏపీ పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి జి.కె.ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ బదిలీపై గందరగోళం ఏర్పడగా.. ఎస్ఈసీ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇద్దరు ఉన్నతాధికారులపై చర్యలకు ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో 2021 ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని.. రాష్ట్రంలో 3.61లక్షల మంది యువత ఓటు హక్కు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులతో 2019 ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఇద్దరు అధికారులు విధి నిర్వహణలో విఫలమయ్యారని.. నిబంధనల ఉల్లంఘనను సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని ఎస్‌ఈసీ ఆదేశించారు. ఏకంగా ఎనిమిది పేజీల్లో ఉత్తర్వులు ఇచ్చారు.ఎస్ఈసీ పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌ బదిలీ చేయాలని సూచించినట్లు సోమవారం ప్రచారం జరిగింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇదే అంశాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించారు. 'రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, ఆ శాఖ కమిషనర్‌ ఇప్పటికే బదిలీ అయ్యారు.. ఆయన (నిమ్మగడ్డ రమేష్) ఇంకా ఎంత మందిని బదిలీ చేసుకున్నా మేం పట్టించుకోం' అని వ్యాఖ్యానించారు. దీంతో మంగళవారం ఉదయం ఎస్‌ఈసీ ఉన్నతాధికారుల బదిలీ ప్రతిపాదనపై స్పందించింది.. ఇద్దరిపై చర్యలకు ఉత్తర్వులు ఇచ్చిం

Related Posts