ప్రయాణుకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-తిరుపతి, కాకినాడటౌన్-సికింద్రాబాద్ మార్గాల్లో (గుంటూరు మీదుగా ) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ (రైల్ నెంబర్: 02734) సికింద్రాబాద్ నుంచి ఈనెల 25న రాత్రి 7.30గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.50కు తిరుపతి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో... తిరుపతి-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 02733) తిరుపతి నుంచి ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.25గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ (రైల్ నెంబర్: 07002) కాకినాడ టౌన్ నుంచి ఈనెల 28న సాయం త్రం 6గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది.