YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

11 అమావాస్య.. వద్దంటున్న బీజేపీ

11 అమావాస్య.. వద్దంటున్న బీజేపీ

జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి కొత్త చిక్కొచ్చిపడింది. వచ్చే నెల 11న కార్పొరేటర్ల ప్రమాణా స్వీకారానికి రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్ కూడా ఇచ్చింది. ఇప్పుడదే కొత్త కార్పొరేటర్లలో గుబులు రేపుతోంది. ఆ రోజు ప్రమాణ స్వీకారానికి బీజేపీ కార్పొరేటర్లు విముఖత వ్యక్తం చేస్తుండగా.. ఎంఐఎం మాత్రం సై అంటోంది. టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు ఇంకా ఎటూ తేల్చేకోలేని పరిస్థితి. ఆ రోజ అమావాస్య కావడమే అందుకు కారణమట!గతేడాది డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అందుకు ఫిబ్రవరి 11న ముహూర్తం కూడా నిర్ణయించారు. అయితే ఆ రోజు అమావాస్య కావడంతో ప్రమాణ స్వీకారం చేసేందుకు చాలా మంది కార్పొరేటర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీలోని కొందరు కార్పొరేటర్లు అమావాస్య రోజు ప్రమాణ స్వీకారం పెట్టడంపై పెదవి విరుస్తున్నారు. ఆ రోజు ప్రమాణానికి గైర్హాజరవుతామంటూ కొందరు నేతలు బాహాటంగానే చెబుతుండడం గమనార్హం.అమావాస్య రోజు ఏ పనీ ప్రారంభించనని రెండోసారి కార్పొరేటర్‌గా గెలిచిన టీఆర్ఎస్ నేత ఒకరు చెప్పారు. కుదిరితే పార్టీ పెద్దల నుంచి అనుమతి తీసుకుని ఆ రోజున ప్రమాణం చేయనని చెబుతున్నారు. అదే విషయమై బీజేపీ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఎంఐఎం చెప్పినట్లు సీఎం కేసీఆర్ వింటున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అమావాస్య రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారంటూ బీజేపీ కార్పొరేటర్ జి.శంకర్ యాదవ్ విమర్శిస్తున్నారు. వాస్తు కోసం సచివాలయాన్ని కూల్చేసిన పెద్దమనిషి.. తమ సెంటిమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదని మరో మహిళా కార్పొరేటర్ ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే ఈ విషయమై కొందరు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 11న ప్రమాణం చేసేందుకు మాకెలాంటి అభ్యంతరం లేదని ఎంఐఎం కార్పొరేటర్లు చెబుతున్నారు. అయితే, ఫిబ్రవరి 11న గ్రహాలన్నీ ఒకే వరుసలోకి వస్తున్నాయని, అలాంటి సమయంలో ప్రమాణ స్వీకారం చేయడం మంచిది కాదని నేతలు భావిస్తారని పండితులు పేర్కొంటున్నారు. దీంతో ప్రమాణ స్వీకారం వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Posts