సరిహద్దు దగ్గర తోక జాడిస్తున్న డ్రాగన్‌పై ఇండియా డిజిటల్ దెబ్బ కొట్టింది. టిక్‌టాక్, వీచాట్ సహా 59 టాప్ చైనా యాప్‌లపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శాశ్వత నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది జూన్‌లో వీటిపై భారత ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించగా.. ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ యాప్‌లు భారతీయుల డేటా సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలపై ఈ నిషేధం విధించారు. ఆ తర్వాత సదరు సంస్థల నుంచి వాళ్ల వివరణ కోరారు.వాళ్లు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ప్రభుత్వం.. వాటిని శాశ్వతంగా నిషేధించాలని నిర్‌చయించినట్లు సమాచారం. ఇప్పటికే 200కుపైగా చైనీస్ యాప్స్‌పై ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. అందులో పాపులర్ గేమ్ పబ్‌జీ కూడా ఒకటి. ఈ గేమ్ పూర్తిగా ఇండియన్ వర్షన్‌తో, కొత్త ప్రైవసీ పాలసీతో పబ్‌జీ ఇండియాగా మళ్లీ రాబోతోందన్న వార్తలు వచ్చినా.. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ గేమ్ మళ్లీ లాంచ్ అయ్యేది సందేహంగా మారింది.