YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతి ఎన్నికలపై క్లారిటీ

తిరుపతి ఎన్నికలపై క్లారిటీ

తిరుపతి, జనవరి 27, 
రెండు పార్టీలు ఒక్క సీటు.. పోటీ మామూలుగా లేదు. గెలుస్తారా లేదా అనే విష‌యం ప‌క్క‌న పెడితే.. బీజేపీ జ‌న‌సేన పార్టీల‌కు అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డం త‌ల‌కు మించిన భారంగా మారింది. ఏ లీడ‌ర్ ని నిల‌బెట్టినా.. ఆ పార్టీకే సీటు ద‌క్కింది.. ఈ పార్టీ సైలెంట్ అయ్యింది అనే పాయింట్ తెర‌పైకి వ‌స్తుంది. అందుకే.. ఎవ‌రి పంతం వాళ్లు నెగ్గించుకునే ప్రాసెస్ లో.. త‌మ అభ్య‌ర్థినే నిల‌బెట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ విష‌యంలో బీజేపీ ఏపీ లీడ‌ర్ల‌కీ.. జ‌న‌సేన పార్టీకి మ‌ధ్య వివాదాలు కూడా బానే క‌నిపిస్తున్నాయి.కానీ.. ఏ పార్టీ కూడా ఒక లీడ‌ర్ అంటూ.. ముందుకు రావ‌డం లేదు. బ‌ట్.. రెండు పార్టీలూ త‌మ అభ్య‌ర్థినే నిల‌బెడ‌తాం అని ప్ర‌చారం మాత్రం చేసుకుంటున్నారు. అందుకే.. ఏ పార్టీ అభ్య‌ర్థిని నిల‌బెడితే.. ఆ పార్టీ పంతం నెగ్గిన‌ట్లు భావించాల్సి వ‌స్తుంది. దీనికోసం జ‌న‌సేన పార్టీ క‌మిటీలు కూడా వేసింది. కానీ.. అభ్య‌ర్థిని మాత్రం ఫైన‌ల్ చేయ‌లేదు. ఎవ‌రు చెప్పినా.. ప్రాబ్ల‌మ్ గ‌ట్టిగానే ఉంటుంది కాబ‌ట్టి.. ఎవ‌రూ త‌మ త‌మ అభ్య‌ర్థి పేర్ల‌ను బ‌య‌టికి తీసుకు రావ‌డం లేదు. ఓప‌క్క టీడీపీ, వైసీపీలు అభ్య‌ర్థుల పేర్ల‌ను బ‌య‌టికి తెలిసేలా చేసి.. కాస్తో కూస్తో ప్ర‌చారంలో ఉన్నారు. కానీ.. బీజేపీ, జ‌న‌సేన మాత్రం ఇంకా మొద‌టి అడుగుల ద‌గ్గ‌రే ఉండిపోయారు. అయితే.. ఈ రెండు పార్టీల‌కీ అనుగుణంగా ఒక మాజీ ఉద్యోగిని తెర‌పైకి తీసుకురావాల‌ని ట్రై చేస్తున్నార‌ట‌. ఎందుకంటే.. బీజేపీ ఇంట‌లెక్చువ‌ల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇటు జ‌న‌సేన కూడా అలాంటి పార్టీనే. సో.. ఫుల్ ఫ్లెడ్జ్ డ్ రాజ‌కీయ నేత‌ను కాకుండా.. ఇంట‌లెక్చువ‌ల్ గా పేరున్న వారిని నిల‌బెడితే.. అంతా కూల్ గా ఉంటుంది అని.. త‌మ త‌మ పార్టీల అజెండాల‌కు అనుగుణంగా ఉంటుంది అని ఆలోచిస్తున్నార‌ట‌. అయితే. ఇన్నాళ్లూ రెండు మూడు పేర్లు వినిపించినా.. స‌డ‌న్ గా ఓ పేరు తెర‌పైకి వ‌చ్చింది. క‌ర్ణాట‌క మాజీ సీఎస్ ర‌త్న‌ప్ర‌భ పేరు ప్ర‌చారంలోకి వ‌చ్చింది. త‌నంటే సీఎస్.. సో.. త‌ను నిల‌బ‌డితే.. మేథావిని నిల‌బెట్టారు అనే పేరు వ‌స్తుందే త‌ప్ప‌.. ఏ పార్టీకి అంత‌గా క్రెడిట్ రాదు. సో.. ఇద్ద‌రి మ‌ధ్యా ఆమెను నిల‌బెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. అయితే.. త‌ను కూడా బీజేపీలో జాయిన్ అయి ఉండ‌డంతో ఇప్పుడు ఇష్యూ మొద‌టికి వ‌చ్చింది. బీజేపీ లీడ‌ర్ గా పేరున్న ర‌త్న ప్ర‌భ‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే.. బీజేపీ పంతం నెగ్గించుకున్న‌ట్లు అవుతుంది అనే విష‌యంలో ఆలోచిస్తున్నా కానీ.. క‌ర్ణాట‌క మాజీ సీఎస్ ర‌త్నప్ర‌భ అయితే.. త‌మ‌కు కూడా అభ్యంత‌రం లేదు అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోందంట జ‌న‌సేన‌. సో.. తిరుప‌తి ఎంపీ సీటు ఉప ఎన్నిక‌కి ర‌త్నప్ర‌భ పేరు ఫైన‌ల్ అవ్వొచ్చు అనే టాక్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
నాయకుల హడావిడి మొదలైందే
తిరుపతి లోక్‌సభకు త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఎన్నికలను పక్కన పెడితే తిరుపతి ఎప్పుడూ భక్తుల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వీఐపీలు వస్తూనే ఉంటారు. వీరిలో రాజకీయ నాయకులు.. వివిధ రంగాల ప్రముఖులు కామన్‌. మామూలుగానే వీరికి దర్శనాలు.. వసతి ఏర్పాటు చేయాలంటే స్థానికంగా ఉంటే ఆయా పార్టీల నేతలకు చుక్కలు కనిపిస్తుంటాయి. అలాంటిది ఇప్పుడు ఉప ఎన్నిక కూడా తోడు కావడంతో ఆ బాధలు పీక్స్‌కు చేరాయట.ఉపఎన్నిక పేరు చెప్పి..హైదరాబాద్‌, అమరావతి, ఢిల్లీల నుంచి ఆయా పార్టీల నాయకులు తిరుపతిలో వాలిపోతున్నారు. తిరుపతికే పరిమితమైతే ఫర్వాలేదు. అక్కడ వసతి చూపించి మిగతా పార్టీ కార్యక్రమాల్లో బిజీ కావొచ్చు. కానీ.. వచ్చినవాళ్లు ఊరికే ఉంటారా.. పనిలో పనిగా తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని కోరుతున్నారట. అదీ బ్రేక్‌ దర్శనం అడుగుతున్నారట. దీంతో మరింత ఇరకాటంలో పడుతున్నారట స్థానిక నాయకులు.ఇలాంటి ఇబ్బందులు..తాకిడి లోకల్‌ బీజేపీ నాయకులకు ఎక్కువగా ఉందట. బీజేపీ జాతీయ పార్టీ. దాంతో ఢిల్లీ నుంచి..అమరావతి, హైదరాబాద్‌ల నుంచి అదే పనిగా నాయకులు డంప్‌ అవుతున్నారు. ఒక్కరుగా కాకుండా పదుల సంఖ్యలో వస్తున్నారు. వీరికి మంచి చెడ్డలు చూడటం ఒక ఎత్తు అయితే..దర్శనం కల్పించడం పెద్ద యజ్ఞంగా మారిందట. ఇప్పుడిప్పుడే టీడీపీ కార్యక్రమాలు కూడా పెరుగుతున్నాయి. ఆ పార్టీ లోకల్‌ లీడర్స్‌పైనా క్రమంగా ఒత్తిడి పెరుగుతోందట. ధర్మపరిరక్షణ పోరాట సమయంలోనే తెలుగు తమ్ముళ్లకు చుక్కలు కనిపించాయట. వసతితోపాటు.. దర్శనాలకోసం పరుగులు పెట్టారట టీడీపీ నేతలు.జనసేన నాయకుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదట. వైసీపీ నుంచి ఇప్పుడిప్పుడే హడావిడి మొదలైంది. అధికార పార్టీ కాబట్టి వారికి వచ్చిన ఇబ్బంది పెద్దగా ఏమీ లేదట. కాకపోతే రాబోయే ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఆయా పార్టీలకు చెందిన నాయకులు తిరుపతిలోని గెస్ట్‌ హౌస్‌లను ముందుగానే బుక్‌ చేసి పెట్టుకున్నారట. బీజేపీ నాయకులైతే ఏకంగా అద్దెకు ఇళ్లే తీసేసుకున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ఇంకెలా ఉంటుందో అని కలవర పడుతున్నారట నాయకులు.

Related Posts