గుంటూరు, జనవరి 27,
లోకేష్ దూకుడు చంద్రబాబును సైతం మించిపోయిందని అంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు. ప్రస్తుతం లోకేష్ దూకుడు.. భవిష్యత్ రాజకీయ పరిణామాలు.. అనే అంశంపై చంద్రబాబు సూచనల మేరకు యనమల రామకృష్ణుడు.. సహా కాల్వ శ్రీనివాసులు.. దేవినేని ఉమామహేశ్వరరాలు.. రిపోర్టు తయారు చేస్తున్నారట. ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు. పొలిటికల్ డేటా బేస్‌లో లోకేష్ హీరోగా మెరిసేందుకు అవసరమైన సూచనలు సలహాలు వీరు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.వీరి అంచనా మేరకు లోకేష్ దూకుడు గత ఏడాదితో పోల్చుకుంటే.. బాగానే పెరిగింది. ముఖ్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయంలో లోకేష్ ముందున్నారు. ఇంతకు ముందు.. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా లోకేష్ రాజకీయం చేసేవారని.. కానీ, ఇప్పుడు ఆయన స్వయంగా ప్రభుత్వం లోని తప్పులు వెదికి పట్టుకోవడంలోను.. కౌంటర్లు ఇవ్వడంలోనూ దూకుడుగా ఉన్నారు. ఆ మాటకు వస్తే ఎన్నికలకు ముందే లోకేష్ ఎమ్మెల్సీ అయిన మరుసటి రోజే మంత్రి అయినా ఏ మాత్రం పరిణితి సాధించలేదుచివరకు లోకేష్ ప్రసంగాల్లో కూడా తప్పుల తడకలే ఉండడంతో చంద్రబాబు లోకేష్‌కు తెలుగు నేర్పించడంతో పాటు ప్రసంగాలు చేసే విషయంలో తర్ఫీదు ఇచ్చేందుకు పెద్ది రామారావును గురువుగా నియమించారు. పెద్ది లాంటి సీనియర్ కూడా లోకేష్‌ను ఎంత సానపెట్టినా మార్చలేకపోయారు. ఇక గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా లోకేష్ కరోనా సాకుతో బయటకు రాలేదు. కరోనా తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చాక లోకేష్ ఉరుకులు పరుగులు పెడుతూ ప్రజల్లోకి వెళుతున్నాడు. ఇది పార్టీ శ్రేణు ల్లోనే కాకుండా.. మేధావి వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. క్షేత్రస్థాయి పర్యటనలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గ్రాఫ్ పెరుగుతోందని నాయకులు అభిప్రాయానికి వచ్చారు. అయితే భవిష్యత్ పార్టీ అధినేతగా.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ అవ్వాలంటే ఇది సరిపోదని.. మరింత పుంజుకోవాల్సిన అవసరం ఉందనేది వీరి సూచన. మరోవైపు.. చంద్రబాబు కన్నా. దూకుడుగా ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తున్నారని.. దీనిని మరింత ఎక్కువగాకొనసాగించాల్సిన అవసరం ఉందని పార్టీ సీనియర్లు పెడుతున్నారు. పార్టీని నడిపించే నాయకుడిగా.. లోకేష్‌కు మరింత గుర్తింపు వచ్చిందని.. గతంలో లోకేష్‌ను తక్కువగా అంచనా వేసిన వారు కూడా ఇప్పుడు.. బాగుందనే చెబుతున్నారు. మొత్తానికి ఈపరిణామం.. లోకేష్ దూకుడును సీనియర్లు కూడా స్వాగతిస్తారుఁ