వార్తలు ఆంధ్ర ప్రదేశ్
రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు అధికారులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారు. వాహన చోదకులు తమ ప్రాణాలే కాక ఎదుటి వారి ప్రాణాలు కూడా తమ చేతిలోనే ఉన్నాయని గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నాడు నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ హాలులో 29వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల కార్యక్రమాన్ని అయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రామకృష్ణ, డీటీసీ శివరాంప్రసాద్ ఇతర అధికారులు పాల్లోన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఫొటో ఎగ్జిభిషన్ ప్రారంభించారు. తరువాత వారోత్సవాల కరపత్రాలు, స్టికర్లను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ వాహనాలు నడిపే వారికి ఏకాగ్రత ముఖ్యమని అన్నారు. 28 శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనాల కారణంగా జరుగుతుండటం, యువతే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని అయన సూచించారు. ప్రమాదాల నివారణకు సమష్టి కృషి అవసరమని మంత్రి అన్నారు.
డ్రైవింగ్ లో ఏకాగ్రత అవసరం : మంత్రి సోమిరెడ్డి