YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్ క్యాబినెట్ పై చర్చోపచర్చలు

కేటీఆర్ క్యాబినెట్ పై చర్చోపచర్చలు

హైదరాబాద్, జనవరి 27, 
తెలంగాణ‌కి కొత్త సీఎం రాబోతున్నారు. అది కూడా ఎంతో దూరంలో లేదు. గ‌ట్టిగా ఒక నెల‌లోపే సీఎం కేసీఆర్ త‌న బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుని త‌న కుమారుడు కేటీఆర్ ని సీఎం గా నియ‌మించ‌బోతున్నారు అనే టాపిక్ ఫుల్ హాట్ గా న‌డుస్తోంది. అయితే.. ఈ విష‌యంలో కొత్త‌ద‌నం ఏమీ లేదు. గ‌త మూడు నాలుగు ఏళ్లుగా తిరుగుతున్న వార్తే ఇది. అయితే.. కేటీఆర్ కేబినెట్ లోకి కొత్త మంత్రులు రాబోతున్నారు అనేదే హాట్ టాపిక్ అయింది.నిజ‌మే.. ప్ర‌తి లీడ‌ర్ కి ఓ బ‌లం ఉంటుంది. కేటీఆర్ లాంటి ముఖ్య‌మైన లీడ‌ర్ కి త‌న జ‌ట్టు అనే లీడ‌ర్స్ క‌చ్చితంగా ఉంటారు. వారికి న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇన్నాళ్లూ త‌న వెంట ఉంటే.. త‌ను ఏం ప‌ట్టించుకోవ‌డం లేదు అనే ఫీలింగ్ క‌చ్చితంగా వారిలో వ‌స్తుంది. సీఎం అయిన త‌ర్వాత కూడా మ‌న‌ల్ని ప‌ట్టించుకోవడం లేదు అని ఫీల్ కావ‌చ్చు. అందుకే.. అలాంటి వారికి ప‌ద‌వులు ఇవ్వాల‌ని కేటీఆర్ అనుకోవ‌డం మామూలే. కానీ.. ఎలా కుదురుతుంది అన్న‌దే హాట్ టాపిక్. ఇప్పుడున్న మంత్రుల్లో ఎవ‌రిపైనా ఎలాంటి ఆరోప‌ణ‌లూ లేవు. పోనీ.. కేటీఆర్ కి వ్య‌తిరేకంగా ఉన్నారా అంటే అదీ లేదు. ముందు ముందు వాళ్లే మా కాబోయే సీఎం కేటీఆర్ అంటున్నారు. కొంద‌రు మినిస్ట‌ర్లు కాని వారు కూడా ఫుల్ స‌పోర్ట్ చేస్తున్నారు.అయితే.. వీరిలో ఎవ‌రిని మంత్రి ప‌ద‌వి వ‌రించ‌బోతుంది అన్న‌ది హాట్ టాపిక్ అయింది. ఒక వేళ‌.. కేటీఆర్ త‌న స‌పోర్ట‌ర్ల‌కి.. త‌న వెంట ఎల్ల‌ప్పుడూ న‌డిచే లీడ‌ర్ల‌కీ మంత్రి ప‌ద‌వి ఇస్తే.. త‌న తండ్రి నియ‌మించిన మినిస్ట‌ర్ల ప‌రిస్థితి ఏంటీ అన్న‌ది పాయింట్. వారిని కూడా దూరం పెట్ట‌లేరు. అంద‌రూ త‌మ‌కంటూ ఓ సీనియార్టీ.. త‌మ‌కంటూ ఓ కేడ‌ర్ ఉన్న‌వాళ్లే. మినిస్ట్రీల్ని కూడా బానే స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ చేస్తున్నారు. పోనీ ఉన్న‌వారిని ఉంచి.. కొత్త‌గా మినిస్ట‌ర్ల‌ని నియ‌మిద్దాం అంటేనేమో.. లిమిట్ ఆల్రెడీ ఫుల్ గా ఉంది.
కొత్త‌గా మినిస్ట‌ర్ ని నియ‌మించాలి అంటే.. ఉన్న వారిపై వేటు వేయ‌క త‌ప్ప‌దు..  ఇప్పుడెలా అన్న‌ది కాబోయే సీఎం కేటీఆర్ కి పెద్ద స‌వాల్ గా మారింది. ఉన్న వాళ్ల‌ని కాద‌న‌లేరు. కొత్త వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేయ‌లేరు. బ‌ట్.. ఎంతో కొంత మార్పులు చేర్పులు చేసి.. ఒక‌రిద్ద‌రిపై ఎఫెక్ట్ ప‌డేలా చూసి అయినా.. త‌న స‌పోర్ట‌ర్ల‌ని ఎంక‌రేజ్ చేయాలి అని చూస్తున్నారు అనే టాక్ రావ‌డంతో ఉన్న మంత్రుల్లో టెన్ష‌న్ మొద‌లైంది. ఎవ‌రిపై వేటు ప‌డ‌బోతుంది అనే పాయింట్ ఇప్పుడు.. టీఆర్ఎస్ వ‌ర్గాలతో పాటు.. అన్ని పార్టీల్లోనూ.. ఇంట్ర‌స్టింగ్ అప్డేట్ అయింది. చూడాలి.. త‌ను సీఎం అయిన త‌ర్వాత‌.. ఎలా మూవ్ అవుతారో.

Related Posts