YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బర్తడే గిఫ్ట్ ... సీఎం పదవేనా..

బర్తడే గిఫ్ట్ ... సీఎం పదవేనా..

కరీంనగర్, జనవరి 27 
మామూలుగా రిట‌ర్న్ గిఫ్ట్ అంటే యాంటీగా అనుకుంటాం. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం త‌న కుమారుడికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నార‌ట‌. కేసీఆర్ బ‌ర్త్ డే అంటే.. కేటీఆర్ గిఫ్ట్ ఇవ్వాలి. కానీ.. నెక్స్ట్ బ‌ర్త్ డే కి మాత్రం.. త‌న బ‌ర్త్ డే నాడు.. కుమారుడు కేటీఆర్ కి గిఫ్ట్ ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట కేసీఆర్. అంతే. క‌దా మ‌రి. కొంత‌మంది ఫాద‌ర్ లు సైకిల్స్ కొనిస్తారు.. కొంత‌మంది ఫాద‌ర్ లు స్కూట‌ర్లు కొనిస్తారు.. కొంత‌మందేమో కార్లు గ‌ట్రా కొనిస్తారు. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం తన బ‌ర్త్ డే నాడు.. గిఫ్ట్ గా కేటీఆర్ కి సీఎం ప‌ద‌వే ఇవ్వ‌బోతున్నారు. ఇదే న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. యాక్చువ‌ల్ గా అయితే..  సీఎం గా కేటీఆర్ ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉండే. కానీ.. బ్రేక్ వేశారు. పోస్ట్ ఫోన్ చేశారు. ఎందుకూ అంటే..ఇందుకే. కేసీఆర్ బ‌‌ర్త్ డే నాడు లేదంటే.. బ‌ర్త్ డే వెళ్లిన తెల్లారే.. కేటీఆర్ ను సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయించాల‌ని.. ఆ రోజు దివ్య‌మైన ముహూర్తం ఉంద‌నీ.. అందుకే ఆగుతున్నార‌ని.. టీఆర్ఎస్ లో ఇంట‌ర్న‌ల్ గా తిరుగ‌తున్న వార్త‌. స‌రే.. బానే ఉంది. ఎలాగూ సీఎం ని చేయాలి అనుకుంటున్నారు క‌దా. ఏళ్ల నుంచీ న‌లుగుతున్న విష‌య‌మే కదా. పార్టీలో కానీ.. బ‌య‌ట కానీ.. మ‌రీ సీరి‌యస్ అబ్జెక్ష‌న్లు అయితే లేవు క‌దా. చేస్తే చేస్తారు కావ‌చ్చు. నిజ‌మేలే.. ఓ 20 రోజులు ఆపి.. ఫిబ్ర‌వ‌రి 17న కేసీఆర్ బ‌ర్త్ డే కాబ‌ట్టి.. ఆ తెల్లారో.. ఆరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తే.. కాస్త ఇంట్ర‌స్టింగ్ గానే ఉంటుందీ అనుకున్నారు. పుత్ర ర‌త్నానికి ఇంత పెద్ద బ‌హుమానం ఇస్తుంటే.. స‌రె స‌రెలే.. ఇస్తే ఇచ్చారులే అనుకున్న వాళ్లే త‌ప్ప‌.. పెద్ద‌గా అబ్జెక్ష‌న్సు పెట్టిన వాళ్లు లేరు. వాళ్ల పార్టీకి జ‌నం సీఎం ప‌ద‌వి అప్ప‌జెప్పారు. ఆయ‌నేమో.. కుమారుడికి ఇస్తున్నారు. ఇందులో అనేదేముంది.. అంటే మాత్రం ఆగేదేముంది అంటూ స‌ర్దుకున్నారు జ‌నాలు.కానీ.. ఇప్పుడు ఆ వార్త కూడా నిజం కాదు.. అనే వార్త నిజం అంటున్నారు జ‌నాలు. పొలిటిక‌ల్ గా కూడా ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయింది. సీఎం చేసే మాట వాస్త‌వ‌మేన‌ట‌. కానీ.. ఇప్పుడ‌ప్పుడే కాద‌ట అంటున్నారు. ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్నాయి తెలంగాణ స్టేట్ లో.. అవ‌న్నీ వ‌దిలేసి ఇప్పుడు కేటీఆర్ ని సీఎం ని చేస్తే త‌ను లాక్కురాలేరు అని.. ఆగుతున్నారు అని తెలుస్తోంది. తెలంగాణ‌లో మేయ‌ర్ ఎన్నిక ఎవ్వారంతో పాటు.. సాగ‌ర్ ఎన్నిక‌, రిజ‌ల్టు.. పార్టీలో ఉన్న అంత‌ర్గ‌త ఫైటింగులు త‌గ్గ‌డం ఇవ‌న్నీ జ‌రిగాక‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, రిజ‌ల్టులు కూడా అయిపోయాక‌.. ప్ర‌శాంతంగా ఓ తీరిక స‌మ‌యంలో మంచి ముహూర్తం చూసుకుని.. కేటీఆర్ కు ప‌ద‌వి అప్ప‌జెబుతారు అనే వార్త బ‌య‌టికొచ్చింది. ఇది బ‌య‌టికి రాగానే.. అవునా.. ముందే అనుకున్నాం.. కేసీఆర్ అంత ఈజీగా ప‌ద‌వి ఇస్తారంటే ఎవ‌రు న‌మ్మారులే.. ఏళ్ల‌కేళ్లుగా వింటున్న మాటేగా అనుకుంటున్నారు.

Related Posts