YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సీపీఎం తోక పార్టీ : తెరాస

సీపీఎం తోక పార్టీ : తెరాస
హైదరాబాద్ లో జరిగిన సిపిఎం పార్టీ బహిరంగ సభలో ఆపార్టీ నేతల ప్రసంగాలు విచిత్రంగా సాగాయి. సిపిఎం నేతలు దేశాన్ని ఏలినట్టుగా పెద్ద మాటలు మాట్లాడారని తెరాస నేతలు కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి రాములు, గట్టు రాంచందర్ రావు ఎద్దేవా చేసారు. సోమవారం నాడు వారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మాట్లాడుతూ సిపిఎం ఎపుడూ తోక పార్టీ గానే ప్రవర్తించింది. .కార్యకర్తలు లేని సిపిఎం అన్నీ స్థానాల్లో పోటీ చేస్తామని ఆత్మవంచనతో మాట్లాడారు. .వారికి పందొమ్మిది సీట్లలో కూడా అభ్యర్థులు లేరని విమర్శించారు. తెరాస తో పొత్తు పెట్టుకోమని ప్రకటించారు. మా పార్టీ ఎప్పుడయినా మీతో పొత్తుకు ప్రయత్నించిందా అని ప్రశ్నించారు. .సిపిఎం అంటే క్యాపిటలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. సిపిఎం ఎప్పూడూ ఇతరుల మీద ఆధారపడి బతికింది. ఎప్పూడూ సొంతగా ఎదగాలని ప్రయత్నించలేదని అయన అన్నారు.జ తెలంగాణ ను అడ్డుకున్న సిపిఎం ఇపుడు తెలంగాణ అభివృద్ధి ని కూడా అడ్డుకుంటోంది. తెలంగాణ లో అభివృద్ధి తమ్మినేని కి కనపడటం లేదా అని నిలదీసారు. .తమ్మి నేని సొంత గ్రామం లో పాలేరు ఉప ఎన్నికలో ఎవరికీ ఎక్కువ ఓట్లు వచ్చాయి ? భక్త రామదాసు ప్రాజెక్టు సిపిఎం కు కనిపించడం లేదా ? కేవలం ఖమ్మం కే పరిమితమైన పార్టీ సిపిఎం అని అన్నారు. .అన్నీ రకాల కార్మికులు మీ జెండాలు మోసి భుజాలు కాయలు కాసాయి. మీ జెండాలు మోసిన కార్మికులకు జీతాలు పెంచింది తెరాస సర్కారు అనే విషయం గుర్తించుకోవాలని అన్నారు. పశ్చిమ బెంగాల్ ను మూడు దశాబ్దాలు పాలిస్తే మూడు శతాబ్దాలు వెనక్కి నెట్టింది సిపిఎం కాదా అని అడిగారు. త్రిపుర లో ఎందుకు ఓడిపోయామో ఆత్మ పరిశీలన చేసుకున్నారా ? సిపిఎం ది పొత్తులు చీకటి ఒప్పందాల పరంపరే. గూట్లో రాయి తీయ లేని వారు ఏట్లో రాయి తీస్తారట. .కేరళ లో వ్యవసాయ సంక్షేమం బాగుందని మాట్లాడేవారు తెలంగాణ లో వ్యవసాయానికి భారీ గా కేటాయింపులు చేశామని వీరభద్రం కు తెలియదా అని అడిగారు. .సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాం ..ఆగస్టు కల్ల కాళేశ్వరం ద్వారా నీళ్లిస్తాం. .రైతుల ఆత్మహత్యలు తెలంగాణ లో తగ్గాయని కేంద్రం చెబుతుంటే సిపిఎం పెరిగాయని ఎలా చెబుతోందని నిలదీసారు. సిపిఎం నేతలు పెద్దగా ఊహించడం మానుకోవాలి. తెరాస సిపిఎం తో పొత్తు పెట్టుకోదు. తెరాస పై చేసిన విమర్శలు ఉపసంహరించుకుంటే సిపిఎం కు మంచిదని సలహా ఇచ్చారు.

Related Posts