YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

సర్వే జనా సుఖినోభవంతు!

సర్వే జనా సుఖినోభవంతు!

_**మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తారో మనకే తెలియని ఒక చిత్రమైన విషయం. అయితే మీరు తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే దీని వెనుక ఉండి నడిపించేవాడు ఆ నటన సూత్రదారి అయిన పరమ శివుడు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, ఆ విధంగా ఒకరికి మరొకరికి బంధాలను, స్నేహాలను కలిపేది ఆ శివుడే, అదే బంధాలను కాలగర్భంలో కలిపేసేది ఆ శివుడే..*_
_**మనిషి జీవితంలో ఒక వస్తువు కాని, ఒక మనిషి కాని, ఒక జంతువు కాని పూర్వ ఋణము వుంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి, రుణాన్ని బట్టి ఈ జన్మలో భార్య కాని, భర్త కాని వివాహబంధంతో ఏకమవుతారు, బంధు బంధం తో బంధుఘనాలు, మిత్రబంధంతో స్నేహబంధాలు ఏర్పడతాయి.*_
_**అలాగే దంపతులకు పిల్లలు పుట్టాలన్నా గతజన్మలో వారి ఋణము మనకు వుండాలి. ఇక మన ఇంట తిరిగే పశువులు. ఏ ఇతరాలైనా కూడా ఋణము వుంటేనే తప్ప మన దరికి చేరవు. ఆ బుణం తీర్చుకోవడానికే వారు మనకు చేరువైతారు.*_
_**అలాగే ఋణము వుంటేనే తప్ప ఎవరితోనైనా స్నేహాలు, బంధువులనే బాంధవ్యాలు కలుస్తాయి. అలాగే మనకు ఎవరైనా కొత్త వారు ఎదురుపడినా, పరిచయం ఏర్పడినా, లేక మాట కలిపినా కూడా ఇవన్నీకూడా  ఋణానుబంధమే.*_
_**అలాగే గతజన్మ ఋణాను బంధం అనేది లేకుంటే ఎవరినీ మన కలలో కూడా మనం చూడలేము. అయితే ఇక ఈ రుణం అనేది తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మనతో నిలవరు. ఏదో ఒక కారణంతో మనతో శాశ్వతంగా విడిపోతారు.*_
_**కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఋణాను బంధం విలువ తెలుసుకుని మసలుకోవాలి. ఈ ఋణబంధం అనేది కేవలం ధనం వరకు మాత్రమే కాదు, బాంధవ్యం కూడా. అందుకే ధన బంధం కంటే ఈ ఋణబంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వలి. "మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో ఋణబంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి. *_
_**కాబట్టి మిత్రులారా ! ఋణం లేనిదే త్రుణం కూడా మనకు ముట్టదు అని మన పెద్దలు చెప్పారు కదా ! ఇది నిజం. మనం ఎంత యత్నించినా కూడా రుణం లేకపోతే ఏది జరగదు. మీ జీవితంలో ఏ బంధం నిలువదు. మీ నుండి ఏ బంధమైనా తెగిపోయినా, లేదా ఎవరైనా మిమ్మల్ని వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా మీరు బాధపడకండి. అంతే కాదు ఎదుటి వారిని నిందించకండి ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి. వారు మీ నుండి దూరమై దూరంగా ఉన్నా, వారు మన వాళ్లేగా ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా అనుకుంటూ, వాళ్ల సంతోషం కోరుకోండి. మీరూ సుఖంగా ఉండండి, ఎదుటి వారిని సుఖంగా జీవించ నివ్వండి.. బంధాలు కల్పించేదీ, కాలగర్భంలో కలిపేసేదీ ఆ శివయ్యే అనేది గుర్తించు కోండి.. శుభం భూయాత్.*_

Related Posts