YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నమ్మకమైనవారికే ఓటు వేయండి

నమ్మకమైనవారికే ఓటు వేయండి

రాష్ట్రంలో అహంకారాలు అహంభావాలు ముందు, పరిపాలన ప్రజలు వెనక ఉన్నారు. రాజ్యాంగ సంస్థలు కి ప్రజాస్వామ్యములో పట్టింపులు సరి కావు. రాష్ట్రంలో ఒక డిసిప్లిన్ లేకుండా పోయింది.కాంగ్రెస్ ఖండిస్తుందని ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ శైలజానాథ్ అన్నారు.  రాష్ట్రంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని కోరుకుంటున్నాం. గతంలో అభ్యర్థులను వేటాడి వెంటాడి నామినేషన్ ని విత్ డ్రా చేసుకునేలా చేశారు. ఏకగ్రీవంగా జరిగిన ఎన్నికలను రద్దు చేసాం అని ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో అని భయంగా ఉంది. రెండు సంవత్సరాలు కాలం లో గ్రామ ప్రాంతాలలో చేసిన అబివృద్ది,రైతులకు చేసిన మేలు ఏంటో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి.  గడచిన 2 సంవత్సరం లలో ప్లెక్సీలు రంగులు వేయడం,ప్రారంభోత్సవం ,జన్మదిన వేడుకలు తప్ప ఏమి కనపడడం లేదు. ప్రజలు రైతులు,అన్ని కులాలు మతాల వారు ఆలోచించి నమ్మకమైన వారికి మాత్రమే ఓటు వేయండి. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకోనే అర్హత ఎవరికి లేదని అన్నారు.


చంద్రబాబు పద్ధతి లేకుండా రాజకీయాలు చేస్తాడు. ఒక్కొక్క చోట ఒక్కో మాట చంద్రబాబు మాట్లాడతారు. నిలకడ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కులాల,మతాల పేరు మీద ప్రజలను విడదీయడానికి రెడీ గా ఉన్నారు. అలాంటి వాళ్లకు ఓటు వేయకండి. మంచి ముఖ్యమంత్రి ఉంటే.. పాలన బాగా ఉంటది. బీజేపీ కి వత్తాసు పలుకుతూ పవన్ కళ్యాణ్ పార్టీ నడుస్తోంది. జనసేన పార్టీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. పవణ్ కళ్యాణ్ చేగువీర బొమ్మ పెట్టుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ కూడా చేగువెర బొమ్మ పెట్టుకుంటరు.  ఆరాచకాలకు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రాణాలు కోల్పోయిన గొప్ప వ్యక్తి చేగువేర . బిజెపి అంటే కమ్యూనిస్టులకు వ్యతిరేకము మిగతా వాళ్ళందరికి వ్యతిరేకమని అన్నారు.


పవనేమో బీజేపీ కి మద్దతు గా మాట్లాడుతారు. రాష్ట్రంలో ఆకలి అరాచకాలు ఎన్నో ఉన్నాయి,దాని మీద మాట్లాడడు. ఎదో పెచ్చు ఉడిపోతే దానిపైన వెళ్లి పవన్ కళ్యాణ్ ధర్నా చేస్తారని విమర్శించారు.
 

Related Posts