YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

రాజకీయ లబ్దికై క్రైస్తవులపై ఆరోపణలు మానుకోవాలి - ప్రవీణ్ కుమార్

రాజకీయ లబ్దికై క్రైస్తవులపై ఆరోపణలు మానుకోవాలి - ప్రవీణ్ కుమార్

రాజకీయ లబ్దికై క్రైస్తవులపై నిందలు వేయడం రాజకీయ నాయకులు మానకోవాలని క్రీస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు యలమంచిలి ప్రవీణ్ కుమర్ అన్నారు.బుధవారం గాంధీ నగరం లోని ఓహోటల్ లో క్రీస్టియన్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యలమంచిలి ప్రవీణ్ కుమార్ అధ్యక్షత వహించారు.ఆంధ్ర రాష్ట్రంలో  క్రైస్తవత్వం మీద జరుగుతున్న దాడులు క్రైస్తవులపై పలువు తమ రాజకీయ లబ్దికై అనేక ఆరోపణలు చేస్తు విమర్శలు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తీవ్ర ఆరోపణలు ఖండిస్తూ పలు తీర్మానం చేయడం జరిగింది. క్రైస్తవుల్ని కించపరుస్తూ క్రైస్తవుల మనోభావాల్ని దెబ్బతీస్తూ చేసే ఆరోపణల పై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సూచించింది.ప్రతి జిల్లాలో సమావేశమై క్రైస్తవుల్ని అప్రమత్తం చేయడంతో పాటు  రాష్ట్రంలో అన్ని జిల్లాల మండలాల్లో  ముఖ్య కేంద్రల్లో సమావేశములు నిర్వహించి సలహలు సూచనలు తీసీకోని కార్యాచరణ రుపోందించుకోవాలని  ఈ కమిటీ తీర్మానించింది. క్రైస్తవుల ఐక్యతను చాటి చెప్పటాన్ని కులాలకు తావులేకుండా అందరు ఐక్యతతో ఉండాలని కమిటీ సూచించింది. క్రైస్తవులు ఏ మతాన్ని కించపరచటం మా అభిమతం కాదు కేవలం క్రీస్తు ప్రేమను చాటటం తప్ప ఏ పార్టీకి,వర్గానికి వ్యతిరేకం కాదని ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా చాటి చెప్పాలని ఈ కమిటీ తీర్మానించింది.టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు క్రైస్తవులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఖండిస్తున్నామని చంద్రబాబు నాయుడు క్రైస్తవులు బలవంతపుమత మార్పిడిలు చేస్తున్నారని వాటిని నిరూపించాలి అని డిమాండ్ చేశారు.చంద్రబాబు మ్యానిఫెస్టోలో పాస్టర్ లకు ఐదు వేలుస్తామని పెట్టలేదా?అని మా మత గురువుల దగ్గర  ఆశీర్వచనాలు తీసుకోలేదాన్నారు.చంద్రబాబు క్రైస్తవుల పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.చంద్రబాబు నాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని 13 జిల్లాలలో పర్యటించి క్రైస్తవులతో చర్చించి చంద్రబాబు వ్యాఖ్యలపై నిరసనలు తెలుపుతామన్నారు.ఈ కార్యక్రమములో రాష్ట్ర క్రైస్తవ నాయకులు డా || బి . దయానందం, రెవరెండ్ విజయరావు , రెవరెండ్ బాలరాజు,మేదర సురేష్ కుమార్,మేజర్ ఎబినేజర్,రెవరండ్ కరణానిధి రెవరండ్ శ్యాముల్ పౌల్,బిషప్ జార్జ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts