గత కొద్దిరోజులుగా భానుముక్కల గ్రామ సరిహద్దుల్లో ఆత్మకూరు మున్సిపాలిటీ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్న సంగతి తెలిసిందే బుధవారం నాడు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని నందికొట్కూర్ నియోజకవర్గ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డంపింగ్ యార్డ్ పరిసరాలను పరిశీలించారు భానుముక్కల గ్రామ ప్రజలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి డంపింగ్ యార్డ్ పూర్తయితే తలెత్తే సమస్యలపై వివరించారు , అనంతరం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం నియోజకవర్గం లోని ఆత్మకూరు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఎక్కడో ఒకచోట ఏర్పాటు చేయకుండా నందికొట్కూరు నియోజకవర్గానికి రావాల్సిన అవసరం ఏంటి అన్నారు సమస్యను పార్టీ అధిష్టానం దృష్టికి జిల్లా ఇన్చార్జి మినిస్టర్ మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వెంట వైసిపి నాయకులు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ టి ఎన్ ఆర్ వెంకటేష్, అబ్దుల్ మజీద్, మున్నా, బాలు నాయక్, బండ్లమూడి వెంకటేశ్వరరావు, మజీద్, ఇబ్రహీం, జయరాజ్ , ఓబులేసు, రమణారెడ్డి, అన్నయ్య, రవి శంకర్ గౌడ్, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు