టిటిసి మేనేజ్మెంట్ విద్యార్థులకు పరీక్ష తేదీ ప్రకటించాలని బుధువారం స్థానిక ఆర్ట్స్ కళాశాల నందు లైబ్రరీ ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆదోని డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో టీటీసీ మేనేజ్మెంట్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకపోవడం ప్రభుత్వానికి సిగ్గు చేటు అన్నారు.బ్రభుత్వానికి మేనేజ్మెంట్ కింద జాయిన్ అయినా టీటీసీ విద్యార్థులు కూడా ఎందుకు కనపడరు అని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను, విద్యార్థుల తరపున సమాధి చేస్తామని హెచ్చరించారు. మేనేజ్మెంట్ కింద జాయిన్ అయిన విద్యార్థులు అంటే ప్రభుత్వానికి అంత చులకనా ప్రభుత్వం తమలో తప్పు పెట్టుకొనే విద్యార్థుల పైన ఆ తప్పును రుద్దుతు విద్యార్థులను ముంచే పరిస్థితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మేనేజ్మెంట్ కింద జాయినైన టీటీసీ విద్యార్థులకు పరీక్ష తేదీలు ప్రకటించి వారి జీవితాలను కాపాడాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్ ) డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బాలు, ధనరాజ్ ,వీరేశ్ ,ఈరన్న, రాము తదితరులు పాల్గొన్నారు.