గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పంచాయతీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు రిజర్వేషన్ ప్రకారం దృష్టిలో పెట్టుకొని ప్రజలంతా ఎన్నికలపై దృష్టి సారించారు. అధికార పార్టీ ఎక్కువ శాతం పంచాయతీలు కైవసం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా ప్రతిపక్షం ధీటుగా ఎదుర్కొనేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది,. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండవు కాబట్టి ఆయా గ్రామాల్లో కులాలు, మతాలు, వర్గాలు,సన్నిహితులు, కుటుంబాలు పై పూర్తిగా ఆధారపడి ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అధికార పార్టీ ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు ప్రచారంలో డబ్బు, అధికారం అన్ని కలిపి ఎన్నికలపై ప్రభావం ఉందని వినికిడి. ఈ ఎన్నికల్లో ఎక్కువ పంచాయతీలు తమ కైవసం చేసుకోవాలని ప్రతిపక్షం ధీమా వ్యక్తం చేస్తున్నట్టు కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. అదేవిధంగా ఈ సారి మేజర్ పంచాయతీల్లో గెలవాలంటే అధిక డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఏది ఏమైనా పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధులు గెలవడానికి ఆయా వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉన్నాయి.