YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏకగ్రీవాలను స్వాగతించండి - నిమ్మగడ్డ

ఏకగ్రీవాలను స్వాగతించండి - నిమ్మగడ్డ

గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేస్ కుమార్ స్పష్టం చేశారు. ప్రత్యేక అధికారి సంజయ్ అదే బాధ్యతలు చూస్తారన్నారు. ఏకగ్రీవాలు బలవంతంగా అవుతున్నాయా? లేదా అన్నదే పర్యవేక్షిస్తారని చెప్పారు. అయితే మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలు తీసుకోవాలని సూచించారు. తరువాత స్థానాల్లో సంక్షేమం కూడా తీసుకోవాలని, కాల్‌ సెంటర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలని నిమ్మగడ్డ సూచించారు.  వెబ్‌కాస్టింగ్‌తో ఉపయోగం లేదని, పోలింగ్‌ కేంద్రం చుట్టూ కొంత ప్రాంతాన్నే అది కవర్‌ చేస్తుందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. వెబ్‌కాస్టింగ్‌ కోసం కొత్త యాప్‌‌ను తీసుకువచ్చామని, ఆ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రాల దగ్గర జరిగేదంతా తెలుసుకోవచ్చునని అన్నారు. రాష్ట్రంలో ఎట్టిపరిస్థితిలో వ్యాక్సినేషన్‌ ఆగకూడదని అన్నారు. యాప్‌ ద్వారా వీడియోలతో పాటు ఎస్ఎంఎస్ కూడా పంపవచ్చునని రమేష్ కుమార్ పేర్కొన్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాక్సినేషన్‌తో పాటు ఎన్నికల నిర్వహణపై చర్చించామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని డీజీపీ వ్యాఖ్యానించారు.

Related Posts