- ఆలయం కూల్చివేత ఆటవిక చర్య బిజెపి
- కూల్చివేసిన ఆలయాన్ని పరిశీలించిన ఎస్ఐ తిప్పేస్వామి
- ఆలయ ధర్మకర్త చంద్ర పోలీసులు ఫిర్యాదు
చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ శివారు ప్రాంతం మదనపల్లె మార్గంలోని ప్రభుత్వ సంజయ్ గాంధీ డిగ్రీ కళాశాల సమీపంలో గల మోస పల్లి ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.
- హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడం అనాగరికమని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి అధ్యక్షుడు ఏ వి సుబ్బారెడ్డి విమర్శించారు.
- నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.
- కూల్చివేసిన ఆలయాన్ని పీలేరు ఎస్ఐ తిప్పేస్వామి తన సిబ్బందితో పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- 2 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఆలయాన్ని కూల్చివేసిన ట్లు ఆలయ ధర్మకర్త చంద్ర తెలిపారు.
- రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం వంటి అనాగరిక చర్యల పరంపర కొనసాగుతున్న ఈ నేపథ్యంలో పీలేరులో ఆలయాన్ని ధ్వంసం చేసి అందులోని విగ్రహాలను దుండగులు ఎత్తు కెళ్ళడం చర్చనీయాంశమైంది.
తిరిగి వేంటనే గుడి పనులను ప్రభుత్వం ప్రరంబించాలని
ఏవైతే కేసులు పేడతారో వారిపైనే రాష్ట్ర ప్రభుత్వం కేసుకడుతుందని
వీటిని మాని వెంటనే సరైన దోసులను శిక్ష పడేలా కృషి చేయాలని అన్నారు