YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

సీఎం ఇచ్చిన హామీలు నెరవేరలేదు

సీఎం ఇచ్చిన హామీలు నెరవేరలేదు

హిందువుల వందల సంవత్సరాల కల అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో నెరవేరబోతుంది. పార్టీలకతీతంగా 2023వరకు మందిర నిర్మాణం పూర్తవుతుంది. మందిర నిర్మాణంతో దేశంలో శాంతి నెలకొని,అభివృద్ధి జరిగి అగ్రరాజ్యాలకు పోటీగా దేశం ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నానని బీజేపీ నేత డీకే ఆరుణ అన్నారు. తెరాస ఏడు సంవత్సరాల పాలనలో నారాయణపేట నియోజకవర్గ పరిధిలో ఒక్క ఎకరాకు నీరు అందించలేదు. అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పార్టీ మారినా  ఇంకా ఇక్కడ వలసలు కొనసాగుతున్నాయి. నారాయణపేట జిల్లా కు సాగునీటి విషయంలో సీఎం ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలకు మాత్రం సీఎం ను అడిగే ధైర్యం చేయటం లేదని ఆమె అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ప్రాంతానికి నీరు రావని తెలిసిన ఎమ్మెల్యేలు  కినుక్కు మనటం లేదు. నారాయణపేట ఎమ్మెల్యేది కర్ణాటక నా,లేదా తెలంగాణ నా అర్థం కావడం లేదు. ఆయన కేవలం ఇక్కడ రాజకీయంగా లబ్ది కోసం ఇక్కడున్నారు. జిల్లా వచ్చినా నారాయణపేట ఇంకా అభివృద్ధి చెందలేదు.ఇక్కడకు వచ్చిన సైనిక స్కూల్ కు ,రైల్వే లైన్ కు మోక్ష మెప్పుడో.. కేవలం పాలమూరు ఎత్తిపోతల పథకం కు 0.40టీఎంసీ  ల ద్వారా 12.50లక్షల ఎకరాలకు నీరు ఎలా అందిస్తారో అర్థం అవటం లేదు ప్రాజెక్టు కు భూ సేకరణ పూర్తి కాలేదు.. కానీ సీఎం గారు ఈ సంవత్సరం లో ప్రాజెక్టు పూర్తి చేస్తా నంటున్నారని ఆమె అన్నారు.

Related Posts