విజయవాడ, జనవరి 28,
నిమ్మగడ్డకి గోల్డెన్ డేస్ నడుస్తున్నయ్. ఎగ్జాక్ట్ గా గోల్డెన్ డేసే ఇవి. ఇన్నాళ్లూ సీఎం జగన్ టైం నడిచింది. ఓ ఆట ఆడుకున్నారంటే నమ్మండి. బొమ్మ చూపించారు అనొచ్చు. కానీ.. ఇక పై నేను వెండితెరపై అదే బొమ్మ రివర్స్ లో చూపిస్తా అంటున్నారు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్. టైం అలాంటిది కాబట్టి.. నడిపించే పనిలో ఉన్నారు. పడినన్నాళ్లు పడ్డా.. రిటైర్మెంట్ టైం.. నిమ్మగడ్డ సినిమాకి క్లైమ్యాక్స్ లా మారింది. ఈ ఉన్న రెండు నెలల పాటు.. నిమ్మగడ్డ టైంకి ఎదురే లేదు అనిపిస్తోంది. గేమ్ లో ఇన్నాళ్లూ పావుగా ఆడిన నిమ్మగడ్డ.. ఇకపై గేమ్ ని మొత్తం లీడ్ చేసే పొజిషన్ లోకి వచ్చారు. పంచాయితీలన్నీ తీరిపోయి.. పంచాయితీ ఎన్నికలు మొదలయ్యాయి కదా. ఇకపై గ్రామంలో సమరం ఏంటో ఏపీలో కనిపించబోతుంది. ఎక్కడికక్కడ కట్టడి చేసి.. దౌర్జన్యాలకు బ్రేకులేసే పనిలో ఉన్నారు నిమ్మగడ్డ. ఎలక్షన్ లలో మామూలుగానే హడావిడి ఉంటుంది. ఎన్నికల టైంలో ఇంకాస్త హడావిడి ఉంటుంది. అధికార పార్టీకే ఎదురేలేదు అన్నట్లు నడుస్తుంది ఎవ్వారం. ఇకపై అలాంటివేం చెల్లవు అనే విషయంలో ఏపీలో అందరికీ క్లారిటీస్ ఉన్నయ్. సో.. పంచాయితీ పోరులో.. ఎలాంటి అవకతవకలు జరక్కుండా.. అధికార పార్టీకి ఏ మాత్రం తలొగ్గకుండా నిర్వహిస్తారు అనే విషయం మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇక ఇంతటితో ఆగేలా లేరు నిమ్మగడ్డ. పెండింగ్ లో ఉన్న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకి కూడా ప్లాన్ చేస్తన్నారట. ఇది అయిపోయిన తెల్లారే.. మళ్లీ గ్రామాల్లో కొత్త సందడి మొదలు కాబోతుంది. దానికి కూడా పెద్దగా టైం తీసుకునేలా లేరు నిమ్మగడ్డ. చూస్తుంటే.. పంచాయితీ ఎన్నికలు అయిపోగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకి వెళ్తారు అనిపిస్తోంది. ఆ ఎన్నికలకి మళ్లీ కొర్రీలు పెట్టడం కుదరకపోవచ్చు.. ఎంత ఇష్య చేసినా మళ్లీ అదే ఎవ్వారం కాబట్టి.. సర్కార్ కూడా ఓకే అంటూ ముందుకెళ్లడమే తప్ప..మళ్లీ మొండికేయడం కుదరకపోవచ్చు. చేసేదేం లేక ఒప్పుకోవడమే సీఎం జగన్ సర్కార్ కి ఎదురుగా ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ కావచ్చు. మరి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడాలి.