విజయవాడ, జనవరి 28,
పొలిటికల్ రణ క్షేత్రాలు అంటే పెద్ద పెద్ద లీడర్లు ఉండాల్సిన అవసరం లేదు. అసలు రాజకీయం అంటేనే గ్రామాలు. పల్లెల్లోంచి రాజకీయం పుడుతుంది. ఏ వ్యవస్థకైనా పల్లెలే పునాదులు అన్నట్లు.. రాజకీయ వ్యవస్థకి కూడా పల్లెలే కదా ప్రాణం పోసేది. అలాంటి చోట ఎన్నికలు అంటే మామూలుగా ఉంటుందా చెప్పండి. ఆ ఎత్తులు.. పై ఎత్తులు.. అబ్బో.. ఊళ్లల్లో ఉండే కతే వేరు. ఎన్నికల టైంలో.. నడిచే పాలిటిక్స్ మామూలుగా ఉండవు. ఇప్పుడు ఇంకాస్త పెరిగాయి. పంచాయితీ ఎన్నికలు అంటే.. ఊళ్లల్లో సెపరేట్ వెదర్ వస్తుంది. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలు అంటే.. ఓవరాల్ గా ఎన్నికలు ఉంటాయి.. పాలిటిక్స్ కూడా ఓవరాల్ గా ఉంటుంది. కానీ.. పంచాయితీ ఎన్నికలు అంటే మాత్రం డీప్ గా వెళ్తుంది. ప్రతి ఊళ్లోనూ సీరియస్ పాలిటిక్స్ బయటికి వస్తయ్. అలాంటి ఎన్నికల జరుగుతున్న టైం కావడంతో.. గ్రామం వేడెక్కింది. నాల్రోజుల్లోనే ఎన్నికలు ఉండడంతో.. ఇంకాస్త హీటెక్కింది.ఓటు ఓటునీ లెక్కేసుకుంటున్నారు. ఒక్క ఓటుని కూడా మిస్ చేసుకోవడం లేదు. ఇప్పుడు ఓటర్ల జాబితా రిలీజ్ చేయకపోవడం.. కొత్త వారికి ఓటు హక్కు ఇవ్వకపోవడంతో.. ఎక్కువ డిసప్పాయింట్ మెంట్ ఉంది గ్రామాల్లో.. ఎందుకంటే.. పంచాయితీ ఎన్నికల్లో ప్రతి ఓటూ లెక్కే. ఒక్క ఓటు తేడాతో.. ప్రెసిడెంట్ పదవి జారిపోయేవి.. ఒక్క ఓటు తేడాతో ఉప సర్పంచ్ పదవి జారిపోయే గ్రామాలు వందల్లో తేలుతయ్. అందుకే.. అన్ని ఓట్లనీ ముందే వేళ్ల మీద లెక్కేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే.. ఎగ్జాక్ట్ నంబర్ కూడా ముందే తెలుస్తుంది. అంత పక్కాగా జరుగుతయ్ ఎన్నికలు. ఇక ఓటుకి ఎకరాలకి ఎకరాలు రాసిస్తారు అనే టాక్ కూడా ఫుల్ గానే ఉంది. మరి అలాంటి ఎన్నికలు అంటే.. గ్రామాల్లో ఇప్పుడు వెదర్ ఎలా ఉందో ఊహించుకోండి. ఏపీ పంచాయితీ ఎన్నికల సందర్భంగా.. ఈ నెల మొత్తం ప్రతి గ్రామంలోనూ ఇదే టాక్ ఉంటుంది. ఇదే హడావిడితో హీట్ ఉంటుంది.