YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

పార్లమెంట్ ఫైట్

పార్లమెంట్ ఫైట్

హైదరాబాద్, జనవరి 28, 
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసే వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, కేటీఆర్ ను టార్గెట్ చేసి ఎన్నో ఆరోపణలు గుప్పించారు. బండి సంజయ్ చేసే వ్యాఖ్యల్లో నిజం ఉందో.. లేదో తెలియదు కానీ.. వరుసగా అలాంటి ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఇదే తంతు నడుస్తూ వస్తోంది. కేసీఆర్ అవినీతికి కూడా పాల్పడ్డారంటూ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలను చేశారు. తాజాగా బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. బండి సంజయ్ అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు సాక్ష్యాలు లేవా..? అని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అవినీతిపరుడని ఆరోపిస్తున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ నెల 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ చేస్తున్న అవినీతిని పార్లమెంటులో ప్రస్తావించనున్నట్టు తెలిపారు. కాళేశ్వరం, సీతారామ, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకుని రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో రైలును సంగారెడ్డి వరకు పొడిగించాలన్న డిమాండ్‌తోపాటు నల్లమలలో యురేనియం తవ్వకాలు, మేడారం జాతరకు జాతీయ పండుగ గుర్తింపు, పసుపు బోర్డు ఏర్పాటు, బీబీనగర్ ఎయిమ్స్, బయ్యారం ఉక్కుపరిశ్రమ వంటి అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని ఉత్తమ్ కుమార్ చెప్పుకొచ్చారు. బండి సంజయ్ దగ్గర కేసీఆర్ అవినీతికి సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు బహిర్గతం ఎందుకు చేయడం లేదో చెప్పాలని కూడా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాక్ష్యాలు లేకుండా ఊరికే ఆరోపణలు చేస్తూ వెళితే ప్రజలు కూడా బండి సంజయ్ ను లైట్ గా తీసుకుని ప్రమాదం లేకపోలేదు
ఇక కాంగ్రెస్...
ముగ్గురూ ముగ్గురే. మామూలు లీడ‌ర్లు కాదు. ఒక‌రు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ప‌ద‌వికి రాజీనామా చేసిన లీడ‌ర్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. మ‌రొక‌రేమో.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం ప్లాన్స్ వేస్తూ క‌ష్ట ప‌డుతున్న కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి, మ‌రో లీడ‌ర్ రేవంత్ రెడ్డి.  ముగ్గురూ ఎంపీలే. అందుకే.. పోటీ క‌రెక్ట్ గా ఉంది. కానీ.. ముగ్గురూ క‌లుస్తాం అంటున్నారు. టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలి అని ప్లానేస్తున్నారు.
ఇదంతా అయ్యే ప‌నేనా అంటే ఏమో.. క‌ష్ట‌మే. ఉత్త‌మ్ కీ.. కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి ఉన్న వైరం ఈనాటిది కాదు. ఎప్ప‌టి నుంచో వీళ్లిద్ద‌రికీ ఫైటింగే జ‌రుగుతోంది. పైపైకి క‌లిసి క‌ట్టుగా ఉన్న‌ట్లు క‌నిపించినా.. మాట్లాడుకుంటున్న‌ట్లు అనిపించినా.. వారి గొడ‌వ‌లు మామూలే. ఇక పోతే.. రేవంత్ రెడ్డికీ.. కోమ‌టి రెడ్డికి కూడా పడ‌దు. పీసీసీ చీఫ్ ప‌ద‌వి కోసం కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డితో పాటు.. రేవంత్ రెడ్డి కూడా సీరియ‌స్ గానే ట్రై చేస్తున్నారు. సో.. వీరిద్ద‌రి మ‌ధ్య కూడా వైరం గ‌ట్టిగానే ఉంది. ప్ర‌జెంట్ గా న‌డుస్తున్న ఫైటింగ్ కావ‌డంతో కాస్త ఇంట్ర‌స్టింగ్ గా కూడా ఉంది.
మ‌రి వీరు ముగ్గురూ పార్ల‌మెంట్ లో టీఆర్ఎస్ ని నిల‌దీస్తాం అంటున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ని నిల‌దీస్తుంది అంటే ఓకే. పోటా పోటీగా ఫైట్ చేయొచ్చు కూడా. కానీ.. వీళ్లు ముగ్గురూ ఎంపీలు.. సో.. పార్ల‌మెంట్ లో నిల‌దీస్తాం అంటున్నారు. ఓకే నిల‌దీస్తే క‌రెక్టే కానీ.. పార్ల‌మెంట్ లో సీఎం కేసీఆర్ అవినీతిని ర‌చ్చ చేయ‌డం అంత ఈజీగా జ‌రుగుతుందా. అంత టైం ఉంటుందా అన్న‌దే ఇంట్ర‌స్టింగ్. అదీకాక‌.. కాంగ్రెస్ నేష‌న‌ల్ పార్టీ.. ఆ పార్టీకి కేటాయించిన టైంలో.. నేష‌న‌ల్ ఇష్యూస్ లేవ‌దీయ‌డం ఆ క‌థ వేరే ఉంటుంది.
అయినా స‌రే.. మేం ప‌ట్టుద‌ల‌గా ఉన్నాం అంటున్నారు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు. ఎలాగైనా స‌రే.. కేసీఆర్ ఫోక‌స్ గా పార్ల‌మెంట్ లో చ‌ర్చ జ‌ర‌పాలి అని.. మిష‌న్ భ‌గీర‌థ‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టుల్లో జ‌రిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీకి ప‌ట్టుబ‌డ‌తాం అంటున్నారు లీడ‌ర్లు. బీజేపీ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడైన బండి సంజ‌య్ కూడా.. వీటిపై ఆధారాలు ఉన్నట్లు చెబుతున్నార‌ని.. సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేయ‌డం లేదు అని డిమాండ్ చేస్తాం అంటున్నారు కాంగ్రెస్ ఎంపీలు. ముగ్గురూ మూడు దారుల్లో వెళ్లే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు.. ఒకే దారిలో క‌లిసి క‌ట్టుగా వెళ్తాం అన‌డంతో.. కాస్త హాట్ హాట్ గానే ఉంది  న్యూస్.

Related Posts