YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

హోటల్స్ వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువులు

హోటల్స్ వ్యర్థాలతో  కంపోస్ట్ ఎరువులు

హైద్రాబాద్, జనవరి 28, 
అత్యధికంగా ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేసే హోటళ్ళు, వ్యాపార సంస్థలు కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటి వరకు 200 వరకు హోటళ్ళు తమతమ పరిధిలో ఈ యూనిట్లను నెలకొల్పాయి. జిహెచ్‌ఎంసి వరుస దాడుల నేపథ్యంలో హోటళ్ళ యజమాన్యాల్లో కదలిక వచ్చింది. పరిశుభ్రతమైన నగరంగా తీర్చిదిద్దుతున్న గ్రేటర్‌కు తమవంతు సహకారాన్ని అందించేలా వారి స్పందన ఉండటంతో వ్యర్థాలను కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నాయి. గ్రేటర్‌లో మొత్తం 313 హోటళ్ళు ఉండగా అందులో 200 వరకు ముందుకు రావడంపై అధికారులు  ఇది సంతోషకరమైన పరిణామమని పేర్కొంటున్నారు. మిగిలినవి కూడా యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా తగు చర్యలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి నిర్ణయించింది. ఈ క్రమంలోనే ప్రధానంగా భారీస్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహిస్తున్నది. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించాలని భావిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్‌ను ‘స్వచ్చత’ కేటగిరీలో దేశంలోనే ప్రథమస్థానంలో నిలిపేందుకు జిహెచ్‌ఎంసి ఆరోగ్య విభాగం ప్రత్యేక దృష్టిసారించింది.గ్రేటర్ పరిధిలో హోటళ్ళే కాకుండా బార్లు, రెస్టారెంట్లు 750, ఫంక్షన్‌హాల్స్ 200లకు పైగా కూడా వ్యర్థాలను క్వింటాళ్ళుగా వెలువరిస్తున్నట్టు జిహెచ్‌ఎంసి గుర్తించింది. వాటికి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది. అయితే, అవి యూనిట్లను కొనుగోలు చేయడంపై ఆరా తీస్తున్నాయని, త్వరలోనే అవి కూడా కంపోస్టు ఎరువుల తయారీ యూనిట్లను నెలకొల్పడం ఖాయమని గ్రేటర్ అధికారులు వెల్లడిస్తున్నారు. అందుకు ముందుకు రానివాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జరిమానాలు విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వారు వెల్లడిస్తున్నారు.

Related Posts