విశాఖపట్టణం, జనవరి 28
విశాఖలో విద్యుత్ శాఖ ఏఈ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఆయనతో పాటూ బంధువులు ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. విశాఖలో సీతమ్మధార, సీతమ్మ పేట, విశాలాక్షి నగర్, ఎంవిపి కాలనీ, రాంబిల్లిలో మొత్తం ఏడు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. నాగేశ్వరరావుకు సంబంధించిన మూడు బ్యాంకు లాకర్లు, ఆస్తులు, భూములను ఏసీబీ గుర్తించింది. ఆంధ్ర, తెలంగాణలో నాగేశ్వరరావుకు కోట్లాది రూపాయల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన బంధువుల పేరిట హైదరాబాద్‌తో పాటు ఏపీలోని పలుచోట్ల ఇళ్లస్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.విశాఖ జిల్లా కొమ్మాది డివిజన్ విద్యుత్ ఏఈగా నాగేశ్వరరావు పనిచేస్తున్నారు. 1991లో నాగేశ్వరరావు సర్వీసులో చేరారు.. 1994లోనే తొలిసారిగా ఏసీబీకి చిక్కడంతో సస్పెండ్ అయ్యారు. ఆయన తీరుమారకపోవడంతో పూర్తిగా విధుల నుంచి పక్కన పెట్టారు. దాదాపు 15 ఏళ్లపాటు ఆయన విధులకు దూరంగా ఉన్నారు. 2012లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీతో ఏఈ ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు.