YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా జోబైడెన్ చెక్

ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా జోబైడెన్ చెక్

న్యూ ఢిల్లీ జనవరి 28  
ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటిగా నూతన అధ్యక్షుడు ట్రంప్ పక్కనపెడుతున్నాడు.హెచ్1బీ హెచ్4 వీసాదారుల ఉద్యోగాలు ఊడిపోయేలా.. అమెరికా నుంచి విదేశీయులు విదేశీ నిపుణులు వెళ్లగొట్టేలా పోతూ పోతూ పాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను   సమీక్షించిన కొత్త అధ్యక్షుడు జోబైడెన్ చెక్ పెట్టారు. తాజాగా జోబైడెన్ తీసుకున్న నిర్ణయం హెచ్1బీ వీసాదారులకు భాగస్వాములకు భారీ ఊరట కల్పించింది. ఈ నిర్ణయం భారతీయ ఐటీ నిపుణులకు ఎంతో ప్రయోజనకారిగా మారింది.అమెరికాలో హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలతోపాటు 21లోపు పిల్లలకు అమెరికా పౌరసత్వం వలస సేవలసంస్థ (యూఎన్సీఐఎస్) హెచ్4 వీసాలు జారీ చేస్తుంటారు. 2015లో అప్పటి అధ్యక్షుడు ఒబామా హెచ్4 వీసాలకు అనుమతిచ్చారు.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాన వలస విధానంపై కఠిన ఆంక్షలు పెట్టారు. హెచ్4 వీసాదారులకు పని అనుమతులు రద్దు చేశారు. దీంతో అమెరికాలో నివాసం ఉంటున్న వలసదారుల భాగస్వాములకు ఉద్యోగం కరువై వీసాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.హెచ్4 వీసాలతో అమెరికాలో ఎంతో మంది విదేశీ మహిళలు వైద్యంతోపాటు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతీయులూ లక్షల్లో ఉన్నారు. కరోనా టైంలో వారి అవసరం అమెరికాకు ఎంతో ఉంది. అందుకే ట్రంప్ రద్దు చేసిన హెచ్4వీసాలపై నిర్ణయాన్ని జోబైడెన్ వెనక్కి తీసుకున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నిర్ణయం ఎంతో మంది భారతీయులకు ఊరట కలిగించనుంది.

Related Posts