జనగామ జనవరి 28
జనగామ జిల్లాలో ఓ మాజీ కౌన్సిలర్ దారుణ హత్య కు గురయ్యాడు. జనగామ పట్టణానికి కి చెందిన పులి స్వామి ఉదయం తెల్లవారు జామున వాకింగ్ చేస్తున్నసమయంలో వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతి కిరతకంగా మారణ ఆయుధాలతో కొట్టి చంపారు. ఈ ఘటన వరంగల్ హైద్రాబాద్ రోడ్డులో గల సోషల్ వెల్ఫేర్ స్కూల్ సమీపంలో జరిగింది. గతంలో పులి స్వామి పై భూవివాద ఆరోపణలు ఉన్నట్టు, బుధవారం నాడు కోర్టు తీర్పు పులి స్వామి కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ భువివాదమే ఈ హత్య కు దారి తీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతి త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఏసీపీ వినోద్ కుమార్ తెలిపారు.