YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్ జనవరి 28 హైదరాబాద్  -నెక్లెస్ రోడ్ లోని  పీపుల్స్ ప్లాజాలో 9 వ గ్రాండ్ నర్సరీ మేళాను ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం ఫ్రారంభించారు. మంత్రి మాట్లడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 120  స్టాల్స్  హైదరాబాద్ -  సికింద్రాబాద్ జంట నగర వాసుల కోసం ఈ నర్సరీ మేళాలో ఏర్పాటు చేశారు. తీరిక లేని పనులతో ఉండే నగర వాసులు  ఇంట్లో మొక్కలు పెంచితే పని ఒత్తిడిని జయిస్తారు. మొక్కలు ఆనందాన్ని, మానసికోల్లోసాన్ని కలుగ జేస్తాయి. ఈ నర్సరీ మేళాలో ఆర్గానిక్, బోన్సాయ్, ఔషధ, అన్ని రకాల పూల, పండ్ల మొక్కలు కొలువు తీరాయి. మొక్కలతో పాటు వీటికి సంబంధించిన అన్ని రకాల పని ముట్లు  ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మొక్కను పెంచడమంటే భావి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే. మన పిల్లలకు ఆస్థి ఇస్తే నిలుపుకుంటారో లేదో కాని మంచి పర్యావరణాన్ని ఇస్తే వాళ్లకు మనం మంచి భవిష్యత్తు ఇచ్చినట్లే. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు. కాని ఆరోగ్యం పోతే తిరిగి రాదు.
మంచి పర్యావరణం తోనే మనిషి ఆరోగ్యం ముడిపడి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇది గుర్తించే హరితహారం  , సామాజిక అడవుల పెంపకం, అర్బన్ ఫారెస్ట్,  పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టిందని అన్నారు.
నగర, పట్టణ స్థానిక సంస్థలు తప్పనిసరిగా పది శాతం పర్యావరణ పరిరక్షణకు వినియోగించాలని చట్టం తెచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. మొక్కలు పెంచడం మన వ్యక్తిగత బాధ్యత. వాటర్ బాటిల్స్ కొనడం మనం చూస్తున్నాం. మనం మొక్కలు పెంచకపోతే భవిష్యత్తులో ఆక్సిజన్ బాటిల్స్ కొనాల్సి వస్తుందేమో. ప్రకృతిని ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడమే. కిచెన్ గార్డెన్ , రూఫ్ గార్డెన్ వంటి మంచి ట్రెండ్ నగరవాసులు పాఠిస్తున్నారు. ఇది అందరూ విధిగా పాఠించాలి.పిల్లకు మొక్కలు పెంచడం నేర్పాలని మంత్రి అన్నారు.

Related Posts