YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నిరంకుశ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ : ఉత్తమ్‌

నిరంకుశ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ : ఉత్తమ్‌

హైదరాబాద్‌ జనవరి 28 
 ముఖ్యమంత్రి కేసీఆర్‌  నిరంకుశ పాలన సాగిస్తున్నారని పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్‌ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 7.5 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. కేసీఆర్‌ ఆదేశాలతోనే 7.5 శాతం ఫిట్‌మెంట్ నిర్ణయం జరిగిందని దుయ్యబట్టారు. 43 శాతానికి తగ్గకుండా ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నారు. హౌస్ అలవెన్స్ తగ్గించడం.. ఉద్యోగస్తులంటే చులకన భావంతో చూడటమేనన్నారు.  ‘‘తెలంగాణలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించింది. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. ఉద్యోగ సంఘాల నేతల ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీగా పనిచేశాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని.. ప్రభుత్వంపై ఉద్యమించాలని’’ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.

Related Posts